అబ్బాయిలూ నేను చనిపోలేదు, హ్యాంగోవర్ అవగాహన కల్పిస్తున్నా
మందు తాగితే గాల్లో తేలినట్టుంటుంది. తెల్లారి హ్యాంగోవర్ తో చచ్చిపోయినట్టుంటుంది. కానీ నిజంగా చచ్చిపోరు.. అంటూ ఓ పోస్ట్ చేసింది ఉర్ఫీ జావేద్.
ముంబై : సోషల్ మీడియా సెలబ్రిటీ పూనమ్ పాండే ఫేక్ డెత్ న్యూస్ తో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసి..ఆ తరువాత తాను బతికే ఉన్నానని.. సర్వైకల్ క్యాన్సర్ అవగాహనకోసమే ఇలా చేశానని క్షమాపణలు చెప్పింది. దీనిమీద మరో సోషల్ మీడియా సెలబ్రిటీ, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్ కౌంటర్ ఇచ్చింది.
తాను పడుకుని ఉన్న ఓ ఫొటోను షేర్ చేస్తూ ఉర్ఫీ తన ఫాలోవర్స్ ను ఉద్దేశించి.. ‘హాయ్ అబ్బాయిలు నేను చనిపోలేదు, హ్యాంగోవర్ పై అవగాహన కల్పిస్తున్నాను. మందు తాగుతుంటే.. గాల్లో తేలినట్టుగా, సజీవంగా అనిపిస్తుంది. అదే ఉదయానికల్లా... హ్యాంగోవర్ తో చచ్చిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితేచనిపోయినట్లు అనిపిస్తుంది. కానీ, మీరు నిజంగా చనిపోరు. చనిపోయినవారు చనిపోలేదు క్షమించండి’ అంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది.
ఈ పోస్ట్ తో పూనమ్ పాండేకు చురక అంటించిందని నెటిజన్లు అంటున్నారు. అయితే, ఉర్ఫీ జావేద్ కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడదు. గతంలో ఆమెను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారంటూ.. ఓ ఫేక్ స్టంట్ చేయడంతో.. విషయం తెలిసిన నిజం పోలీసులు సీరియస్ అయిన సంగతి తెలిసిందే.
విచిత్రమైన వస్త్రధారణతో అబ్బాయిల మనసులు కొల్లగొడుతూ..హాట్ ఫేవరేట్ గా మారింది ఈ బాలీవుడ్ బ్యూటీ. వింత ఫ్యాషన్స్ తో కాదేదీ డ్రెస్ కి అనర్హం అన్నట్టుగా ఉంటాయి ఆమె డ్రెస్సులు. ఆమె వేసుకునే బట్టలు, ఫ్యాషన్ మీద నెటింట్లో ఎన్నో రకాల మీమ్స్, రీల్స్, ట్రోల్స్ వస్తుంటాయి. వీటన్నింటినీ తనను పబ్లిసిటీనే అనుకుంటుంది ఉర్ఫీ.