Asianet News TeluguAsianet News Telugu

డ్రెస్సింగ్ పై బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు.. నటి ఉర్ఫీ జావెద్ ఫిర్యాదు

ఉర్ఫీ జావెద్ డ్రెస్సింగ్ పై బీజేపీ మహిళా నేత చిత్ర కిషోర్ వాఘ్ ఘాటు విమర్శలు చేసింది.  దీంతో ఆగ్రహించిన ఉర్ఫీ ..  మహారాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. వాఘ్‌పై ఫిర్యాదు చేశారు.  
 

Urfi Javed files police complaint against BJP s Chitra Wagh, claims criminal intimidation
Author
First Published Jan 14, 2023, 5:27 AM IST

ఉర్ఫీ జావేద్ .. యువతకు పరిచయం అక్కలేని పేరు. హిందీ బిగ్‌బాగ్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు తన అసాధారణ శైలి, డ్రెసింగ్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. తరుచు తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసుకుంటూ.. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే.. అప్పుడప్పుడు ఈ నటి డ్రెసింగ్ పై వివాదాలూ చెలరేగాయి.

తాజాగా ఆమె డ్రెసింగ్ పై ఓ వివాదం చెలారేగింది. ఆమె డ్రెసింగ్ పై బీజేపీ మహిళా నేత చిత్ర కిషోర్ వాఘ్ ఘాటు విమర్శలు చేసింది.  దీంతో ఆగ్రహించిన ఉర్ఫీ ..  మహారాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. బీజేపీ నేతపై ఉర్ఫీ జావేద్ ఫిర్యాదు చేశారు. బహిరంగంగా బెదిరింపులకు పాల్పడినందుకు , హాని చేస్తానని బెదిరించినందుకు చిత్ర కిషోర్ వాఘ్ పై ఫిర్యాదు నమోదైంది. అలాగే.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)లోని సంబంధిత సెక్షన్ కింద చర్య తీసుకోవాలని ఉర్ఫీ జావేద్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు.

ఉర్ఫీ జావేద్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ..  'ప్రజా హానీ కలిగించేలా బెదిరింపులకు పాల్పడినందుకు బీజేపీ కార్యకర్త చిత్రా కిషోర్ వాఘ్‌పై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద ఫిర్యాదు చేశాను. ఆ నేతపై ఐపీసీ సెక్షన్‌ U/s 153(A)(B), 504, 506, 506(ii) కింద ఫిర్యాదు చేశామని, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రుపాలీ చకంకర్‌ను కలిసి .. ఆ నేతకు వ్యతిరేకంగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అలాగే చిత్ర వాఘే వ్యాఖ్యల అతనంరం నటి ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమెకు రక్షణ కల్పించాలని కోరానని ఉర్ఫీ జావేద్ తరఫు న్యాయవాది  పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే.. 
జనవరి 4న, బీజేపీ నేత చిత్ర కిషోర్ వాఘ్ ..  ఉర్ఫీ జావేద్ డ్రెస్సింగ్ సెన్స్ గురించి ట్విట్టర్‌లో వరుస ట్వీట్లను పోస్ట్ చేశారు. ఇందుకు మహిళా కమిషన్ ఏమైనా చేస్తుందా లేదా అని ప్రశ్నించారు'ఈరోజుల్లో కొందరు మహిళలు అర్ధ నగ్న మహిళలు రోడ్డుపై స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వారు మహారాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బతీస్తున్నారని ఆమె మండిపడ్డారు. మహిళా కమిషన్ స్వయంగా ఎందుకు నోటీసులు తీసుకోవడం లేదు? ఈ నిరసన కేవలం ఉర్ఫీకి వ్యతిరేకంగా కాదు, బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా అసభ్యకరంగా దుస్తులు ధరించి తిరిగే వారందరికి వ్యతిరేకమని అన్నారు. దీనిపై మహిళా కమిషన్ ఏమైనా చేస్తుందా? లేదా? అని ప్రశ్నించారు. ఛత్రిపతి శివాజీ మహారాజా జన్మించిన మహారాష్ట్రలో ఇలాంటి అర్ధనగ్న ప్రదర్శనలు చేసేవారిని ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో వీడియో విడుదల చేశారు. ఉర్ఫీపై చిత్ర కిషోర్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అనంతరం చిత్రపై ఉర్ఫీ దాడి చేశాడు. చిత్ర పోలీసు ఫిర్యాదుకు వ్యతిరేకంగా ఉర్ఫీ అనేక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను పంచుకున్నారు. మొదటి పోస్ట్‌లో, ఉర్ఫీ ఇలా రాసింది. నేను నా గురించి గర్వపడుతున్నాను. చిత్ర తాయి నా ప్రత్యేక కాబోయే అత్తగారు. మరొక ట్వీట్‌లో.. నా డిపి చాలా బాగుంది, చిత్రా నా అత్తగారు. అని ఉర్ఫీ రచ్చరచ్చ వేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios