సివిల్స్ 2020 ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు అభ్యర్ధులు, పి.శ్రీజకు 20వ ర్యాంక్
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే సివిల్ సర్వీసెస్ 2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. అలిండియా స్థాయిలో శుభం కుమార్ మొదటి ర్యాంకు, జాగ్రతి అవస్థి రెండో ర్యాకు, అంకితా జైన్ మూడో ర్యాంకు సాధించారు.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే సివిల్ సర్వీసెస్ 2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 761 మంది ఎంపికవ్వగా.. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 263 మంది జనరల్ , 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 86 మంది ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులు ఎంపికయ్యారు.
అలిండియా స్థాయిలో శుభం కుమార్ మొదటి ర్యాంకు, జాగ్రతి అవస్థి రెండో ర్యాకు, అంకితా జైన్ మూడో ర్యాంకు సాధించారు. అటు సివిల్స్ ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. నలుగురు అభ్యర్థులు 100లోపు ర్యాంకులు సాధించారు. తెలుగు అభ్యర్థిని పి. శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు 27వ ర్యాంకు, రవికుమార్ 84వ ర్యాంకు, యశ్వంత్ కుమార్‌రెడ్డి 93వ ర్యాంకు సాధించారు.