New Delhi: జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (ఆర్సీఏ)లో కోచింగ్, శిక్షణ పొందిన 23 మంది అభ్యర్థులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022కు ఎంపికయ్యారు. గతేడాది నిర్వహించిన యూపీఎస్పీ పరీక్షల్లో మొత్తం 933 మంది అభ్యర్థులను వివిధ సర్వీసుల్లో నియామకాలకు సిఫారసు చేశారు. 

UPSC'S Civil Services Exam 2022: జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (ఆర్సీఏ)లో కోచింగ్, శిక్షణ పొందిన 23 మంది అభ్యర్థులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022కు ఎంపికయ్యారు. మొత్తం 933 మంది అభ్యర్థులను వివిధ సర్వీసుల్లో నియామకాలకు సిఫారసు చేశారు. వీరిలో జ‌మియా ఆర్సీఏకు చెందిన వారు 23 మంది అభ్య‌ర్థులు కాగా, వీరిలో జ‌మ్మూకాశ్మీర్ కు చెందిన ఇద్దరు, ఒక మహిళ సహా నలుగురు టాప్ 100 జాబితాలో వివిధ ర్యాంకులు, స్థానాలను దక్కించుకున్నారు.

ఏఐఆర్ 7కు చెందిన వసీం అహ్మద్ భట్, ఏఐఆర్ 84కు చెందిన నవీద్ అహ్సాన్ భట్ కశ్మీర్ కు చెందినవారు కాగా, ఏఐఆర్ 86కు చెందిన అసద్ జుబైర్ కూడా అందులో చోటు దక్కించుకున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2022 సెప్టెంబర్ లో సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షను, 2023 జనవరి-మే మధ్య పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించింది. యూపీఎస్సీ సివిల్ స‌ర్వీసెస్ ఎగ్జామ్ 2022 ఫ‌లితాల్లో ముగ్గురు టాపర్లు మహిళలే ఉన్నారు. ఇషితా కిశోర్ అగ్రస్థానంలో, గరిమా లోహియా రెండో స్థానంలో, ఉమా హారతి ఎన్ మూడో స్థానంలో నిలిచారు.

యూపీఎస్సీ 2022 ర్యాంకులతో ముస్లిం అభ్య‌ర్థుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

1. 7 వసీం అహ్మద్ భట్

2. 84 నవీద్ అహ్సాన్ భట్

3. 86 అసద్ జుబెర్

4. 154 అమీర్ ఖాన్

5. 159 రుహానీ

6. 184 అయాషా ఫాతిమా

7. 189 షేక్ హబీబుల్లా

8. 193 జుఫిషాన్ హక్

9. 231 మనన్ భట్

10. 268 ఆకిప్ ఖాన్

11. 296 మొయిన్ అహ్మద్

12. 298 మహమ్మద్ ఇదుల్ అహ్మద్

13. 350 అర్షద్ మహమ్మద్

14. 354 రషీదా ఖాతూన్

15. 398 ఇమాన్ రిజ్వాన్

16. 441 మహమ్మద్ రిస్విన్

17. 476 మహ్మద్ ఇర్ఫాన్

18. 570 సయ్యద్ మహ్మద్ హుస్సేన్

19. 586 ఖాజీ ఆయేషా ఇబ్రహీం

20. 599 ముహమ్మద్ అఫ్జెల్

21. 612 ఎస్ మహమ్మద్ యాకూబ్

22. 642 ఎంఓహెచ్డీ షాదా

23. 736 తస్కిన్ ఖాన్

24. 745 మహ్మద్ సిద్ధిఖ్ షరీఫ్

25. 760 అఖిల బి.ఎస్.

26. 768 ఎండీ బుర్హాన్ జమాన్

27. 774 ఫాతిమా హారిస్

28. 852 ఇరామ్ చౌదరి

29. 913 షెరిన్ షహానా టి కె

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఇతర సివిల్ సర్వీసెస్ పోస్టులకు మొత్తం 933 మంది అభ్యర్థులను సిఫార్సు చేశారు. కాగా, 2021లో కేవలం 25 మంది ముస్లింలు మాత్రమే సివిల్ సర్వీసెస్ కు అర్హత సాధించారు. 2021లో మొత్తం ప్రవేశాలు 685 మాత్రమే కాగా, 2021లో 933 ఉండగా, శాతం పరంగా ముస్లింల పరిస్థితి అలాగే ఉంది. గతంలో 30 మంది ముస్లింలను ఎంపిక చేసినట్లు తప్పుగా వార్తలు వచ్చిన సంగ‌తి తెలిసిందే.