ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత శనివారం తొలిసారి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో తొలి నిర్ణయంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు సీఎం యోగి వెల్లడించారు. ఈ పథకం ద్వారా సుమారు 15 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందనున్నట్టు తెలిపారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి అధికారాన్ని నిలుపుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం రెండోసారి ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. 52 మంత్రులూ నిన్న ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. రెండో సారి అధికారాన్ని అందిపుచ్చుకున్న యోగి ప్రభుత్వం తాజాగా శనివారం తొలి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో యోగి ప్రభుత్వం సెకండ్ టర్మ్‌లో తొలి నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని సీఎం యోగి స్వయంగా వెల్లడించారు.
శనివారం నిర్వహించిన తొలి మంత్రిమండలి సమావేశంలో ఉచిత రేషన్ బియ్యం పంపిణీని మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో మూడు నెలలు అంటే జూన్ 30వ తేదీ వరకు అమలు చేస్తామని సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ రోజు లక్నోలో వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 15 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందుతారని వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ పథకం ఈ నెలాఖరుతో ముగియనుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ప్రతి నెల ఐదు కిలోల చొప్పున ఉచితంగా ధాన్యాన్ని అదనంగా అందిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ (uttar pradesh) ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని వాజ్‌పేయ్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) , పలువురు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మొత్తం 52 మందితో యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో 25 నుంచి 30 మంది వరకు కొత్త వారికి అవకాశం కల్పించారు. డిప్యూటీ సీఎంలుగా కేశ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్‌లకు యోగి ఛాన్స్ ఇచ్చారు. అలాగే ఐదుగురు మహిళా మంత్రులకు కూడా అవకాశం కల్పించారు.
ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగగా.. ఈ నెల 10న ఎన్నికల ఫలితాలు వెలువబడ్డాయి. ఇందులో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ 255 స్థానాల్లో, దాని మిత్ర పక్షాలు18 స్థానాల్లో విజయం సాధించడంతో 273 సీట్ల మెజార్టీతో యూపీలో మరోసారి అధికారం చేపట్టనున్నది బీజేపీ. ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ గట్టి పోటీ ఇచ్చిన ఎస్పీ కి 111 సీట్లు, దాని మిత్రపక్షాలకు కేవలం 14 సీట్లు గెలిచాయి. కాగా, తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన యోగి ఆదిత్యనాథ్ రెండోసారి సీఎం పదవిని చేపట్టి మరో రికార్డు సృష్టించనున్నారు. ఈ తరుణంలో అనేక రికార్డులను Yogi Adityanathబ్రేక్ చేశారు.
