ప్రియుడితో సన్నిహితంగా ఉండగా చూశారని.. సొంత చెల్లెళ్లను హతమొందించిన అక్క
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో దారుణం జరిగింది. ఓ అక్క తన ఇద్దరు చెల్లెళ్లను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో దారుణ ఘటన వెలుగు చూసింది. బల్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పూర్ గ్రామంలో ఓ అక్క దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు చెల్లెళ్లను అత్యంత క్రురంగా నరికి చంపింది. తనకు ఏమి తెలియనట్టు పైగా ఓ కట్టు కథ అల్లింది. కానీ, పోలీసులు 24 గంటల్లోనే ఈ దారుణ హత్యలకు గల కారణాలను తెలుసుకున్నారు. ఆ అక్కను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పూర్ గ్రామంలోని 18 ఏళ్ల ఓ యువతి తన ఇద్దరు అమాయక సోదరీమణుల ప్రాణాలను బలిగొంది. ఆ దుర్మార్గాన్ని దాచిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసింది. పొలాల నుంచి తిరిగి వచ్చిన తల్లి ఇంట్లో రక్తపుమడుగులో ఉన్న తన పిల్లలను చూసి.. తల్లాడింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బల్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పూర్ గ్రామంలో జరిగింది. మృతులను జైవీర్ సింగ్ కుమార్తెలు సురభి (6), రోష్ని (4)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 18 ఏళ్ల యువతిని సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ముగ్గురి ప్రమేయం
ఈ ఘటనపై కాన్పూర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజి) ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. నిందితుడు అంజలి పాల్ (18) నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. ఈ కేసులో కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని విచారణకు నేతృత్వం వహిస్తున్న కుమార్ తెలిపారు. పోలీసులు అంజలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితురాలైన అమ్మాయితో పాటు ముగ్గురు వ్యక్తులను కూడా విచారించారు.
ఇటావా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) సంజయ్ వర్మ మాట్లాడుతూ.. "మేము నిందితురాలని విచారిస్తున్నాం, హత్య వెనుక గల కారణాలను త్వరలో వెల్లడిస్తాము. ఇది కాకుండా, మేము ముగ్గురి ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నాము." అని తెలిపారు.
హత్య జరిగిన ఇంట్లో హత్యాయుధం (పార)ను , నిందితులు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సాక్ష్యాధారాలను నాశనం చేసే ప్రయత్నం చేశారనీ, బట్టలపై రక్తపు మరకలను ఫోరెన్సిక్ బృందం గుర్తించిందని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో జైవీర్, అతని భార్య సుశీల, వారి కుమారులు నంద్ కిషోర్ (12), కన్హయ్య (8) ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులకు అంజలిపై అనుమానం వచ్చింది.
పోలీసులు నిందితురాలని అంజలిని విచారించగా.. తాను ఇంటికి తిరిగి వచ్చే వరకు ఒక గదిలో తన సోదరీమణుల మృతదేహాలు, మరొక గదిలో వారి తలలు కనిపించాయని అంజలి పోలీసులకు తెలిపింది. ఇంట్లో నుంచి పారను స్వాధీనం చేసుకున్న జైవీర్ పాల్ ఉదయం దానిని ఉపయోగించినట్లు పోలీసులకు చెప్పాడని, అయితే దానిని శుభ్రం చేసినట్లు తెలుస్తోంది. పారకు ఉన్న రక్తపు మరకలను తుడవడానికి ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు.
పోలీసులు విచారించినప్పుడు నిందితురాలు అంజలి పరస్పర విరుద్ధమైన వివరణలు ఇచ్చింది. ఆ తర్వాత తదుపరి విచారణ కోసం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆమెతన నేరాన్ని అంగీకరించింది. తన ప్రియుడితో సన్నిహితంగా ఉండగా తన చెల్లెళ్లు చూశారనీ, ఈ విషయాన్ని ఎక్కడ తన తల్లిదండ్రులకు చెబుతారేమోననే భయంతో వారిని హతమొందించినట్టు తెలిపారు. హత్య అనంతరం తండ్రి, సోదరుడు పనిచేస్తున్న పొలాల్లోకి వెళ్లానని, ఆ తర్వాతే పొలాల్లోకి వెళ్లి తిరిగి వచ్చానని పోలీసులకు తెలిపింది.