దేశంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో  చట్టాలు తీసుకువచ్చాయి. అత్యాచారాలు చేస్తున్న వారికి కఠిన శిక్షలు కూడా విధిస్తున్నారు. అయినా కూడా ఘెరాలు ఆగడం లేదు. దాదాపు పది సంవత్సరాల క్రితం ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఘటన మరోసారి పునరావృతమైంది. ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళపై కదిలే బస్సులో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రతాప్‌గఢ్ నుంచి నోయిడాకు వెళ్తున్న ఓ ప్రైవేటు ఏసీ స్లీపర్ బస్సు 25 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకుని బస్సు ఎక్కింది. ఈ క్రమంలో మహిళపై కన్నేసిన బస్సు డ్రైవర్లు వెనుక చివరి సీట్లో కూర్చోమన్నారు. అనంతరం పిల్లలను చంపుతామని బెదిరించి కదులుతున్న బస్సులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

 బస్సు దిగిన వెంటనే ఆమె భర్త సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 36, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దారుణానికి పాల్పడ్డ నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు.