అప్పుడే పుట్టిన ఓ పసికందుని.. ఓ మహిళ నడిరోడ్డుపై వదిలివెళ్లింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది. గ్రే కలర్ సాంటా కారులో వచ్చిన ఆ మహిళ.. బిడ్డను అక్కడ వదిలేసి వెళ్లిపోయింది.

ఈఘటన అంతా.. సమీపంలోని ఓ సీసీ కెమేరాలో రికార్డు అయ్యింది. చిన్నారి ఏడుపువిని బయటకు వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో.. సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

 

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిడ్డను అలా నడి రోడ్డుపై వదిలిన మహిళపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.