Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో కలిసి కుటుంబసభ్యులను చంపిన మహిళకు ఉరిశిక్ష

చనిపోయిన వారిలో ఆమె తల్లి, తండ్రి, సోదరులు, సోదరి కూడా ఉన్నారు. ఈ కేసులో సలీం, షబ్నమ్ లకు స్థానిక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. 

UP Shabnam may be the First woman to be Hanged After India's Independence, Know All About her case
Author
Hyderabad, First Published Feb 18, 2021, 7:30 AM IST


ప్రియుడితో కలిసి సొంత కుటుంబసభ్యులను దాదాపు ఏడుగురిని అతి కిరాతకంగా చంపిన ఓ మహిళకు తాజాగా ఉరిశిక్ష వేయడానికి న్యాయస్థానం సర్వం సిద్ధం చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆమె పేరు షబ్నమ్ కాగా.. స్వాతంత్య్రానంతరం తొలిసారి ఉరిశిక్షకు గురయ్యే మహిళకు ఆమె అయ్యే అవకాశం ఉంది.

యూపీలోని అమ్రోహా ప్రాంతానికి చెందిన షబ్నమ్ 2008లో ప్రియుడు సలీంతో కలిసి తన కుటుంబానికి చెందిన ఏడుగురిని అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి హతమార్చింది. ఇంగ్లీష్ లో ఎం. ఎ చేసిన షబ్నమ్.. ఐదో తరగతి ఫెయిల్ అయిన సలీంను ప్రేమించింది. పెళ్లికి కుటుంబసభ్యులు నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడింది.

చనిపోయిన వారిలో ఆమె తల్లి, తండ్రి, సోదరులు, సోదరి కూడా ఉన్నారు. ఈ కేసులో సలీం, షబ్నమ్ లకు స్థానిక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. సుప్రీం కోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థిచండంతో చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అది కూడా తిరస్కరణకు గురి కావంతో వీరిని ఉరి తీయడానికి మథుర జైలు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్భయ కేసులో నిందితులకు ఉరి వేసిన పవన్ జల్లాదే.. ఈమెను ఉరి తీయనున్నారు. తేదీ ఇంకా ఖరారు కాలేదు.

ఉరితేసే గదిని ఇప్పటకే రెండు సార్లు పరిశీలించారు. షబ్నమ్ కు మందు మహారాష్ట్రలోని అక్కాచెల్లెళ్లు సీమా గవిట్, రేణు షిండేలకు కూడా ఉరిశిక్ష పడింది. ఐదుగురు చిన్నారులను హత్య చేసిన కేసులో వీరు నిందితులు. వీరి క్షమాభిక్షను 2014లో రాష్ట్రపతి తిరస్కరించారు. వీరికింకా ఉరిశిక్ష అమలు కాలేదు. ప్రస్తుతం యరవాడ జైలులో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios