ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ (uttar pradesh assembly polls) ఎన్నికల్లో భాగంగా.. ఐదో విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 53.98 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ (uttar pradesh assembly polls) ఎన్నికల్లో భాగంగా.. ఐదో విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 53.98 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 6 గంటల వరకు క్యూలైన్‌లో వున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
అవధ్, పూర్వాంచల్ (awadh , purvanchal) ప్రాంతాల్లోని 12 జిల్లాల్లోని 61 నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ జరిగింది. మొత్తం 692 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షీప్తమైంది. ప్రయాగ్ రాజ్, అమేథీ, రాయ్ బరేలీ, అయోధ్య వంటి కీలక జిల్లాల్లో ఈ దఫా పోలింగ్ జరిగింది. అత్యధికంగా చిత్రకూట్ జిల్లాలో 59.64 శాతం పోలింగ్ నమోదైంది. 58.01 శాతంతో ఆ తర్వాతి స్థానంలో అయోధ్య నిలిచింది. ప్రతాప్‌గఢ్ జిల్లాలో అత్యల్పంగా 50.25 శాతం మంది మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు.
సిరతు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య.. ప్రయాగ్ రాజ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ ఓటు వేశారు. ఇదిలా ఉంటే.. ప్రతాప్‌గఢ్ కుందా స్ధానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి గుల్షన్ యాదవ్ కాన్వాయ్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో గుల్షన్ క్షేమంగా తప్పించుకున్నారు. ఈ దాడిలో కాన్వాయ్‌లోని ఓ వాహనం ధ్వంసమైంది.
కాగా.. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారంతో కలిపి 292 స్థానాలకు ఓటింగ్ పూర్తయ్యింది. మార్చి 3, 7 తేదీల్లో 6, 7 విడతల పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. 2017లో యూపీలో జరిగిన ఎన్నికలో బీజేపీ (bjp) అత్యధిక స్థానాలు గెలుపొంది అధికారం ఏర్పాటు చేసింది. సీఎంగా యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (samajwadi party) అధికారంలో ఉంది. అయితే 2017 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ (congress)తో కలిసి పోటీ చేసింది.
కానీ ఈ సారి కాంగ్రెస్ కు దూరంగా ఉంది. అయితే ఆర్ఎల్ డీ (RLD), అప్పాదళ్ (Apnadhal)తో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్, బీజేపీలు ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. ఈ సారి కాంగ్రెస్ కూడా మొదటి నుంచి ప్రచారం గట్టిగానే నిర్వహించింది. అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), మాయావతి (mayavathi) నేతృత్వంలోని బీఎస్పీ (bsp) కూడా పోటీలో ఉన్నాయి. మరి ఈ సారి ఎవరిని ఓటర్లు ఆశీర్విదిస్తారో.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియాలంటే మార్చి 10 వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది.
