Asianet News TeluguAsianet News Telugu

భార్యను బుజ్జగించాలి.. రెండు రోజులు సెలవు ఇవ్వండి.. ప్రభుత్వ అధికారి లీవ్ లెటర్ వైరల్

ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి తన పై అధికారికి రాసిన లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తన భార్యను బుజ్జగించడానికి రెండు రోజులు సెలవు కావాలని అడిగాడు. ఆ సెలవు మంజూరు అయింది.
 

UP officer seeks leave to persuade her wife.. leave letter viral
Author
New Delhi, First Published Aug 3, 2022, 4:12 PM IST

లక్నో: అలకతో తల్లి దగ్గరకు వెళ్లిన భార్యను బుజ్జగించాల్సి ఉన్నదని, తిరిగి ఆమెను తన ఇంటికి తీసుకురావలసి ఉన్నదని ఓ ప్రభుత్వ అధికారి సెలవు లేఖలో పేర్కొన్నారు. ఈ పని చేయడానికి తనకు అర్జెంట్‌గా రెండు రోజుల సెలవు ఇవ్వాలని కోరారు. ఈ అభ్యర్థనను పై అధికారి అంగీకరించడం గమనార్హం. ప్రస్తుతం ఈ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

కాన్పూర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి షంషద్ అహ్మద్ తనకు రెండు రోజులు సెలవు కావాలని ప్రేమ్ నగర్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌కు లీవ్ లెటర్ రాశాడు. తనకు అర్జెంట్‌గా సెలవులు కావాలని కోరాడు. షంషద్ అహ్మద్ ప్రకారం, ఆయనకు తన భార్యతో గొడవ జరిగింది. ఆ తర్వాత ఆమె తనపై అలకతో పిల్లలను వెంటబెట్టుకుని ఆమె తల్లి ఇంటికి వెళ్లింది. తద్వార తాను కూడా చాలా బాధ పడ్డాడు.

చివరకు అత్త వారింటికి వెళ్లి తన భార్యను కన్విన్స్ చేయాలని అనుకుంటున్నాడు. అందుకే తన లీవ్ లెటర్‌లో ఈ విషయాన్ని రాశాడు. తన భార్య దగ్గరకు వెళ్లి ఆమెను బుజ్జగించి తిరిగి తన ఇంటికి తీసుకురావాల్సి ఉన్నదని పేర్కొన్నాడు. కాబట్టి, తన సెలవు దరఖాస్తును అంగీకరించాల్సిందిగా కోరాడు. 

ఆ సెలవు దరఖాస్తును బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అప్రూవ్ చేశాడు. ఈ లీవ్ లెటర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. చివరికి అయితే అహ్మద్‌కు సెలవు దొరికింది. తన భార్యతో గొడవను సద్దుమణిగించుకోవడానికి అవకాశం లభించింది.

Follow Us:
Download App:
  • android
  • ios