హోంగార్డుపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తర్వాత... నిందితుడు అమిత్ కుమార్ పై కేసు నమోదు చేయలేదని.. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సెనా మేనల్లుడు అరాచకానికి పాల్పడ్డాడు. ఓ హోంగార్డు పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. దాదాపు 30 నిమిషాల పాటు దాడి చేయడం గమనార్హం. కాగా.. ఈ ఘటన జరిగిన దాదాపు వారం తర్వాత.. పోలీసులు మంత్రి మేనల్లుడు అమిత్ కుమార్ పేరు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం గమనార్హం.

హోంగార్డుపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తర్వాత... నిందితుడు అమిత్ కుమార్ పై కేసు నమోదు చేయలేదని.. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. పోలీసులు ఘటన జరిగిన వారం రోజుల తర్వాత.. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

హొంగార్డు పై దాడి టీ స్టాల్ దగ్గర జరగడం గమనార్హం. ఓ టీస్టాల్ దగ్గర పనిచేసే హోంగార్డు ఓమేంద్ర తో.. బీర్ బాటిల్స్ పట్టుకొని వెళ్తున్న అమిత్ కుమార్, అతని స్నేహితులు వివాదానికి దిగారు. అనంతరం అతిపై దాడి చేశారు. హోంగార్డు యూనిఫాం సైతం విప్పేశారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

తొలుత.. అమిత్ కుమార్ పేరు మినహాయించి ఇతరుల పేర్లను మాత్రమే ఎఫ్ఐఆర్ లో లోకల్ పోలీసులు నమోదు చేశారు. అయితే... ప్రధాన నిందితుడు అమిత్ పేరు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయకపోవడంపై విమర్శలు రావడంతో... చివరకు పోలీసులు అతని పేరు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని తదుపరి దర్యాప్తు చేస్తామని వారు చెప్పారు.