ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం  శవాన్ని ద్విచక్రవాహనానికి కట్టి... దాదాపు 15కిలో మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... మీరట్ కి చెందిన ముకుల్ కుమార్(21) అనే యువకుడిని కొందరు వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం యువకుడి మెడను తాడుతో ద్విచక్రవాహనానికి కట్టారు. దాదాపు 15కిలో మీటర్ల దూరం శవాన్ని ఈడ్చుకెళ్లారు. కాగా... బుధవారం ఉదయం ముకుల్ మృతదేహం పోలీసుల కంట పడింది. అతని ఎడమ కాలు లేదు. కుడి కాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. శరీరంపై చాలా చోట్ల గాయాలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు.

యువకుడిని ముందుగా చంపేసి ఆ తర్వాత ఇలా పగ తీర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముకుల్ తలలో బులెట్లను కూడా పోలీసులు గుర్తించారు. 15కిలోమీటర్ల దూరం ఈడ్చుకు వెళ్లి అనంతరం మీరట్ కి సమీపంలో పడేసినట్లు గుర్తించారు. దుండగులు... యువకుడి మృతదేహంతోపాటు ద్విచక్రవాహనాన్ని కూడా అక్కడే వదిలేయడం గమనార్హం.

ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించి.. వారిని అడిగి పలు విషయాలని తెలుసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతనిపై పగ ఉంటేనే ఇంత దారుణంగా హత్య చేసే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.