Asianet News TeluguAsianet News Telugu

ఘరానా మోసం : ఆన్ లైన్ లో చూసి ఫింగర్ ప్రింట్ల తయారీ.. 500 అకౌంట్లు హ్యాక్.. !

నకిలీ ఫింగర్ ప్రింట్లతో 500 బ్యాంక్ అకౌంట్లను కొల్లగొట్టిన ఘరానా ముఠాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లూ గన్ ను ఉపయోగించి ఫింగర్ ప్రింట్లను ఎలా క్లోనింగ్ చేయచ్చో వీరు ఆన్ లైన్లో చూసి నేర్చుకోవడం విశేషం. అంతేకాదు ఒక్క ఫింగర్ ప్రింట్ రెడీ చేయడానికి వీరికి ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదట. 

UP : Man learns cloning fingerprints online, hacks 500 bank accounts - bsb
Author
Hyderabad, First Published Feb 23, 2021, 11:35 AM IST

నకిలీ ఫింగర్ ప్రింట్లతో 500 బ్యాంక్ అకౌంట్లను కొల్లగొట్టిన ఘరానా ముఠాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లూ గన్ ను ఉపయోగించి ఫింగర్ ప్రింట్లను ఎలా క్లోనింగ్ చేయచ్చో వీరు ఆన్ లైన్లో చూసి నేర్చుకోవడం విశేషం. అంతేకాదు ఒక్క ఫింగర్ ప్రింట్ రెడీ చేయడానికి వీరికి ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదట. 

ఇలా క్లోనింగ్ చేసిన ఫింగర్ ప్రింట్లతో పలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది దారుల బ్యాంకు అకౌంట్లలో పడ్డ డబ్బులను కాజేస్తున్నారు. ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన, వృద్ధాప్య పించన్లు లాంటి వాటిమీద గురి పెట్టారు. 

ఆరుగు సభ్యుల ఈ ముఠాలో గౌరవ్ అనే వ్యక్తి డిగ్రీ వరకు చదువుకున్నాడు. బరేలీ లోని కన్నట్ ప్రాంతంలో ఫొటోకాపీ షాప్ నడుపుతున్నాడు. ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశాడు. ఈ ముఠాలో ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారని షాజాన్ పూర్ పోలీసులు తెలిపారు. గౌరవ్ దగ్గర్నుండి దాదాపుగా 500 క్లోనింగ్ ఫింగర్ ప్రింట్స్, లబ్దిదారుల ఆదార్ కార్డులు, బ్యాంక్ పాస్ బుక్ లు స్వాధీనం చేసుకున్నారు. 

ఇలాంటి గ్యాంగులు ఇంకా ఏమైనా ఉన్నాయా.. ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయనే దానిమీద వెతుకుతున్నాం అని, ఇలాంటి మోసాల గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని ఐజీ రాజేష్ పాండే అన్నారు. సమాచారం ఇచ్చిన వారికి 25వేల నగదు బహుమతిని కూడా ఇస్తామని సోమవారం మీడియా సమావేశంలో  ప్రకటించారు. 

జలాలాబాద్ ప్రాంతంనుంచి ఈ రాకెట్ నడుస్తున్నట్టుగా షాజాన్ పూర్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ జిల్లానుంచే చాలా మంది లబ్దిదారులు తమకు డబ్బులు అందలేదని ఫిర్యాదులు చేస్తుండడంతో రంగంలోకి దిగారు. 

ఈ క్రమంలో బ్యాంకుల్లో ప్రశ్నించగా ప్రభుత్వం నుండి వచ్చే మొత్తం లబ్ది దారుల అకౌంట్ లో పడుతున్నాయని, అవి ఆ తరువాత బ్యాంకు మిత్రాలు నడిపే జనసువిధ కేంద్రాల నుండి డ్రా అవుతున్నాయని కనిపెట్టారు. 

దీంతో అధికారులు బ్యాంకు మిత్రాల్లో పనిచేసే శివరాం, సునీల్ త్రిపాఠి, దేవ్ వ్రత్, సందీప్ సింగ్, శహ్రాన్, రాజీవ్, హుకూమ్ సింగ్ నిఘా పెంచారు. ఈ క్రమంలో వరాం, సునీల్ త్రిపాఠి, దేవ్ వ్రత్, సందీప్ సింగ్ లు నిందితులుగా తేలారు. ముందు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత వీరికి ఫింగర్ ప్రింట్స్ క్లోనింగ్ చేసి ఇస్తున్న గౌరవ్ ను అరెస్ట్ చేశారు. 

అయితే గౌరవ్ ఈ ఒక్కరికే కాదు.. జిల్లాలోని ఇలాంటి మరిన్ని గ్యాంగులతో సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios