Asianet News TeluguAsianet News Telugu

పిహెచ్‌డి విద్యార్థిని హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి..  విసిరేసిన ఇంటి యజమాని..! అసలేం జరిగింది?

ఉత్తరప్రదేశ్ లోని మోదీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ హత్య జరిగింది. కోటి రూపాయల అత్యాశతో ఓ ఇంటి యాజమాని తన ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికేశాడు.ఆ ముక్కలను పాలిథిన్‌లో పెట్టి ..నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు. ఈ  ఘటన 2 నెలలు కింద జరిగినా ..  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతరుల కోసం అన్వేషణ కొనసాగుతోంది.

UP Man Kills Tenant, PhD Student, Dumps His Chopped Body Parts At 3 Locations
Author
First Published Dec 15, 2022, 5:36 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అమానుష హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత.. ఇలాంటి సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటిదే మరో హత్య కేసు వెలుగు చూసింది. కానీ..ఇక్కడ ఇంటి యజమాని (యజమాని) ఒక్క అద్దెదారుని దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికి.. నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు. ఈ అత్యంత దారుణ ఘటన 2 నెలలు కింద జరిగింది. కానీ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

యూపీలోని ఘజియాబాద్ జిల్లా మోదీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాధా ఎన్‌క్లేవ్‌ కాలనీలో ఉమేష్ శర్మ అనే వ్యక్తి తన అద్దెదారు అంకిత్ ఖోకర్‌ను హత్య చేశాడు. అంతటితో ఆగకుండా..అతని మృతదేహాన్ని ముక్కలు చేసి..కాలువలో విసిరివేశాడు. పోలీసులు నిందితుడు ఉమేష్ శర్మను  బుధవారం అరెస్టు చేశారు. కోటి రూపాయల అత్యాశతో పీహెచ్‌డీ విద్యార్థి అంకిత్‌ను హత్య చేసినట్టు తెలిపారు.  అలాగే.. ఇంటి యజమాని మాత్రమే కాకుండా హంతకుడి స్నేహితుడైన పర్వేష్‌ను కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ సంఘటన అక్టోబర్ 5 రాత్రి జరిగింది. నిందితుడి ఇంటి నుంచి  మృతదేహాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగించిన రంపాలు, కాలిపోయిన బట్టలు,అంకిత్ జుట్టు,రక్తం మరకలు కనుగొనబడ్డాయి. ఇతరుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తిని అంకిత్ ఖోకర్ గా గుర్తించారు. కొన్ని సంవత్సరాల క్రితం అతని తల్లిదండ్రులు మరణించారు.  దీంతో అప్పటి నుండి ఒంటరిగా జీవిస్తున్నాడు.బాగ్‌పత్‌లోని ముకంద్‌పూర్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల అంకిత్ చౌదరి నగరంలోని రాధా ఎన్‌క్లేవ్ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతనికి తన ఇంటి యాజమాని, దేవేంద్రపురి నివాసి ఉమేష్ శర్మతో స్నేహం ఏర్పడింది.

కొద్ది రోజుల్లోనే ప్రాణ స్నేహితులుగా మారారు. అంకిత్ తన వ్యక్తిగత విషయాలను అన్నింటిని తన ఓనర్ తో షేర్ చేసుకునే వాడు.  లక్నోలోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి చేస్తున్నాడు. మూడు నెలల క్రితమే ఆయన ఫైలు సమర్పించారు. ఈ క్రమంలో అంకిత్ తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం. అతని తల్లిదండ్రులు అంతకుముందే చనిపోవడంతో పూర్వీకుల ఆస్తి అతని పేరు మీదకు వచ్చింది. ఈ ఆస్తిని కోటి రూపాయలకు అమ్మేశాడు.

మరోవైపు అంకిత్‌తో పీహెచ్‌డీ చేస్తున్న సహచరులు రెండు నెలలుగా అతడితో మాట్లాడకపోవడంతో.. అతడిని వెతుక్కుంటూ మోదీనగర్‌కు వచ్చారు. అంకిత్ రెండు నెలలుగా ఇంటికి రాలేదని ఇక్కడ వారికి తెలిసింది. డిసెంబర్ 12న మోడీ నగర్ పోలీస్ స్టేషన్‌లో అంకిత్ మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశాడు. ఈ దీంతో విచారణ  పోలీసులు ప్రారంభించారు. చుట్టుపక్కల వారిని విచారించగా అంకిత్‌కి ఉమేష్‌తో మాత్రమే స్నేహం ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. పోలీసులు విచారణలో అంకిత్ ఖోకర్ తన ఇంటి యజమానికి రూ.40 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఇంటి యజమాని ఉమేష్ శర్మను తమదైన శైలిలో ప్రశ్నించగా.. మొత్తం ఘటన వెలుగులోకి వచ్చింది. 

అక్టోబరు 5న అంకిత్ ఖోకర్‌ను గొంతు కోసి చంపినట్లు తెలిపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రంపంతో  మూడు భాగాలుగా చేసి అల్యూమినియం ఫాయిల్‌లో ప్యాక్ చేసినట్లు వెల్లడించాడు. ఇందులో రెండు ముక్కలను ముస్సోరీ, ఖతౌలీలోని కాలువలోకి విసిరివేయగా, మరో ముక్కను దుహైలోని తూర్పు పెరిఫెరల్ సమీపంలో విసిరి వేసినట్టు తెలిపాడు. హత్య తర్వాత ఉమేష్ అంకిత్ ఏటీఎం, యూపీఐ ద్వారా డబ్బులు డ్రా చేస్తూనే ఉన్నాడు. పీఎన్‌బీ ఖాతా నుంచి వివిధ మార్గాల్లో రూ.20 లక్షలు డ్రా చేశాడు.

ఈ క్రమంలో ఉమేష్‌ ఆరోగ్యం క్షీణించడంతో అంకిత్‌ ఏటీఎంను బిస్రాఖ్‌కు చెందిన తన స్నేహితుడు ప్రవేశ్‌కు ఇచ్చి అందులో చాలా డబ్బు ఉందని, దానిని విత్‌డ్రా చేసేందుకు ఉత్తరాఖండ్ వెళ్లాల్సి ఉందని చెప్పాడు. ఎవరికీ అనుమానం రాకుండా మీ ఫోన్‌ను ఇంట్లోనే ఉంచుకోవాలని, అంకిత్‌ ఫోన్‌ను ఏటీఎంలో ఆన్‌లో ఉంచుకోవాలని చెప్పాడు. ప్రవేశ్ డిసెంబర్ 1న హరిద్వార్ వెళ్లి రూ.40వేలు విత్ డ్రా చేసుకుని తిరిగొచ్చాడు. మరుసటి రోజు రిషికేశ్ వెళ్లి ఇక్కడి నుంచి కూడా రూ.40 వేలు విత్ డ్రా చేసుకున్నాడు. డిసెంబర్ 12న కూడా రూర్కీలోని ఏటీఎం నుంచి రూ.40 వేలు డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios