Asianet News TeluguAsianet News Telugu

రెండు కోట్ల కోసం స్నేహితుడి కిడ్నాప్, హత్య.. కరోనా మృతదేహంగా అంత్యక్రియలు..

స్నేహితులకోసం ప్రాణాలిచ్చే ఫ్రెండ్స్ ను చూశాం కానీ.. డబ్బు ఆశతో స్నేహితుడినే దారుణంగా చంపేసిన ఘటన ఒళ్లు గగుర్పొడుస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఆగ్రాలో చోటుచేసుకుంది. కొంతమంది స్నేహితులు డబ్బు కోసం ఫ్రెండ్ ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతడిని చంపి.. కోవిడ్‌ వల్ల చనిపోయాడు అని చెప్పి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కానీ పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 

UP Man Kidnapped, Murdered For 2 Crores Ransom, Cremated As Covid Victim - bsb
Author
Hyderabad, First Published Jun 29, 2021, 10:38 AM IST

స్నేహితులకోసం ప్రాణాలిచ్చే ఫ్రెండ్స్ ను చూశాం కానీ.. డబ్బు ఆశతో స్నేహితుడినే దారుణంగా చంపేసిన ఘటన ఒళ్లు గగుర్పొడుస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఆగ్రాలో చోటుచేసుకుంది. కొంతమంది స్నేహితులు డబ్బు కోసం ఫ్రెండ్ ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతడిని చంపి.. కోవిడ్‌ వల్ల చనిపోయాడు అని చెప్పి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కానీ పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 

ఆ వివరాలు... ఉత్తరప్రదేశ్ కు చెందిన కోల్డ్ స్టోరేజ్ ఓనర్ సురేష్ చౌహాన్ ఒక్కగానొక్క కుమారుడు సచిన్ చౌహాన్ (23) జూన్ 21 కిడ్నాప్ అయ్యాడు.  రెండు కోట్ల రూపాయల కోసం స్నేహితులే ఈ నేరానికి పాల్పడ్డారు. స్నేహితులు నలుగురు మరో వ్యక్తితో కలిసి అతని  కిడ్నాప్ కు  ప్లాన్ చేశారు.

ఈ క్రమంలో సచిన్ స్నేహితుడు ఒకరు అతనికి కాల్ చేసి పార్టీ చేసుకుందాం అని పిలిచాడు. తర్వాత అందరూ ఓ పాడుబడిన ట్యాంక్ మీద కూర్చొని మందు తాగారు. ఆ తర్వాత లామినేషన్ పేరుతో సచిన్ కు ఊపిరాడకుండా చేసి  నిందితులు హత్య చేశారు.

ఇండియా మ్యాప్ వివాదం: ట్విట్టర్ ఎండీ మనీష్ మహేశ్వరిపై కేసు...

సచిన్ కిడ్నాపైన దగ్గరనుంచి అతడి తల్లి కుమార్ రెడ్డి నెంబర్ కి కాల్ చేస్తూనే ఉంది. వేరే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేసి సచిన్ ఇక్కడ లేడని తెలిపేవారు.  దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.  మరోవైపు సచిన్ స్నేహితులు తమ మిత్రుడు చనిపోయాడని నమ్మించడం కోసం పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించి సమీపంలోని నదిలో నిమజ్జనం చేశారు.

ఇక వీరి కదలికలపై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి వీరి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  విచారణలో రెండు కోట్ల రూపాయల కోసం ప్రమాదమని భావించి తామే సచిన్‌ను కిడ్నాప్‌ చేశామని.. కానీ అతడు బతికుంటే తమకు  ప్రమాదం అని భావించి.. హత్య చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ ‘‘నిందితులు 25 రోజుల క్రితమే హత్యకు ప్లాన్ చేశారు.  సచిన్‌ను చంపిన తర్వాత అతడి తల్లిదండ్రులకు కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని భావించారు’’ అని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios