ఓ వ్యక్తి మహిళపై కన్నేశాడు. ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం తన పేరు, మతం, గుర్తింపు అన్నీ తప్పుగా చూపించి ఆమెను మనువాడాడు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత.. తాను ముస్లిం అని చెప్పి.. ఆమెను కూడా మతం మారాలంటూ బలవంతం చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి.. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మయనుద్దీన్ అనే వ్యక్తి గతేడాది ఓ యువతితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. తన పేరు మున్నా యాదవ్ గా చెప్పాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ నమ్మించి ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడు. 

పెళ్లి తర్వాత కొంత కాలానికి ఆమెతో అసలు నిజం చెప్పేశాడు. అక్కడితో ఆగకుండా... ఆమెను కూడా మతం మార్చుకోవలంటూ బలవంతం చేయడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది.  తనలాగానే మరో మహిళను కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడన్న విషయం ఆమెకు తెలిసింది. దీంతో.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసుకున్న పోలీసులు నిందితుడిని, అతని కజిన్ రెహమాన్ అలీ ని కూడా అరెస్టు చేశారు.