జూదానికి, మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తనని కట్టుకున్న పాపానికి భార్యని బలిచేశాడు.  తన కళ్ల ముందే భార్యపై స్నేహితులు అత్యాచారానికి పాల్పడుతున్నా... చూస్తూ ఉండిపోయాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... యూపీలోని జాన్‌పూర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో జూదం ఆడటానికి అతని స్నేహితుడైన అరుణ్, బంధువు అనిల్‌ తరుచూ వస్తూపోతుండేవారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి జూదంలో డబ్బులు పోగొట్టుకున్నాడు.ఈసారి తన దగ్గర పెట్టడానికి డబ్బులు లేకపోవడంతో... కట్టుకున్న భార్యను పందేంగా పెట్టాడు.

అతను మళ్లీ ఓడిపోవడంతో...అరుణ్, అనిల్ లు అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సంఘటన జరిగాక బాధితురాలు తన మేనమామ ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత భర్త.. ఆమె వద్దకు వెళ్లి తప్పైపోయిందంటూ క్షమించమని బతిమలాడాడు. తిరిగి ఇంటికి తీసుకొస్తూ మార్గమధ్యంలో కారును ఆపి మళ్లీ అనిల్‌, అరుణ్‌ను ఆమెపై మళ్లీ అత్యాచారం చేసేందుకు ఉసిగొల్పాడు. 

దీంతో సదరు బాధితురాలు జఫరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు.  చివరకు ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో  కోర్టు ఆదేశాల మేరకు సామూహిక అత్యాచారం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.