Asianet News TeluguAsianet News Telugu

Uttar Pradesh : వేలాది విద్యార్థులకు Free Smartphone, Tablets పంపిణీ

ఉచిత స్మార్ట్ ఫోన్ యోజ‌న లో భాగంగా యూపీ రాష్ట్రంలోని లక్ష మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్​లను పంపిణీ చేసింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయీ జయంతిని పురస్కరించుకుని వీటిని అందించింది. లఖ్​నవూలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు.
 

UP govt to start distribution of free tablets, smartphones today
Author
Hyderabad, First Published Dec 25, 2021, 8:09 PM IST

Free Smartphone Tablets UP: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు స‌మీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయ పార్టీలు హీటెక్కాయి. అధికార బీజేపీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ప్ర‌చారం వ్యూహాలు ర‌చిస్తోన్నాయి.  వచ్చే ఏడాదిలో జ‌ర‌గ‌నున్న యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ తామే గెలువాల‌ని సీఎం యోగి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తోన్నారు. ఈ క్ర‌మంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే తమను తిరిగి గెలిపిస్తాయనే భావిస్తోన్నారు. ఈ నేప‌థ్యంలో భాగంగానే  కోటి మంది విద్యార్థులకు ట్యాబ్​లు, స్మార్ట్ ఫోన్లు ఉచితంగా అందించే కార్యక్రమానికి  సీఎం యోగి ఆదిత్యనాథ్​ శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే.. ఈ పథకాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.3000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, టెక్నికల్ మరియు డిప్లొమాలో చదువుతున్న విద్యార్థులు UP ఉచిత టాబ్లెట్ స్మార్ట్‌ఫోన్ పథకం యొక్క ప్రయోజనాన్ని  పొంద‌నున్నారు.

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్​పేయీ జయంతి సంద‌ర్భంగా సీఎం యోగి.. ఉచిత స్మార్ట్ ఫోన్ యోజ‌న తొలివిడతను ప్రారంభించారు.  లఖ్​నవూలోని ఏకానా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో  గ్రాడ్యుయేషన్, పారా గ్రాడ్యుయేషన్ చదివే లక్ష మంది ఫైనల్ ఇయర్​ విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, ట్యాబ్​లను శనివారం పంపిణీ చేశారు.  తొలి విడతలో భాగంగా శనివారం 60వేల స్మార్ట్‌ఫోన్లు, 40వేల ట్యాబ్‌లను విద్యార్థులకు అందజేసింది. ట్యాబ్​లు, మొబైల్​ ​ఫోన్లు అందుకున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. 

Read Also:

ఈ సంద‌ర్బంగా సీఎం యోగి మాట్లాడుతూ.. యువత నిరాశవాదాన్ని వ‌దిలి.. స్వేచ్ఛ యుతంగా ఆలోచించాల‌ని, మ‌న ఆలోచ‌న‌లు ప‌రిమితంగా ఉండొద్ద‌ని అన్నారు. అప్పుడే.. మ‌న వ్య‌క్తిత్వంలో మార్పు వ‌స్తోంద‌ని .. కొత్త ఆవిష్క‌ర‌ణ‌కు దారి తీస్తోందని అన్నారు. యువ‌త నిరాశ‌ను త‌మ దారికి చేర‌నివ్వ‌కుండ‌దని అన్నారు. ఏ ప‌నినైనా.. అత్యంత ఆస‌క్తితో ప్ర‌య‌త్నిస్తే.. అనుకున్న‌ది త‌ప్ప‌కుండా సాధించ‌గ‌ల‌ర‌ని  యోగి ఆదిత్యనాథ్ అన్నారు.  

అనంత‌రం యూపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి కుమార్‌ వినీత్‌ మాట్లాడుతూ..  దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో యువతకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు అందజేస్తున్నారు. MA, BA, BSc, ITI, MBBS, MD, BTech, MTech, PhD MSME మరియు స్కిల్ డెవలప్‌మెంట్ చివరి సంవత్సరం విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. డిజి శక్తి పోర్టల్‌లో 38 లక్షల మందికి పైగా యువత నమోదు చేసుకున్నారని.. మిగతా వారి రిజిస్ట్రేషన్లు ఇంకా కొనసాగుతున్నాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కుమార్ వినీత్ తెలిపారు.

Read Also: 

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లావా, సామ్‌సంగ్ మరియు ఏసర్ వంటి అనేక ప్రసిద్ధ కంపెనీలకు స్మార్ట్‌ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లను సరఫరా చేయడానికి ఆర్డర్లు ఇచ్చింది. ఈ కంపెనీలు డిసెంబర్ 24లోపు ఆర్డర్లు ఇస్తాయి. తొలి దశలో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ల కొనుగోలుకు రూ.2035 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. 
ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా..  ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయ్ చానూను యూపీ ప్రభుత్వం సత్కరించింది. ఆమెకు రూ.1.5 కోట్లను ప్రభుత్వం అందించింది. ఆమె కోచ్​ విజయ్ కుమార్​ శర్మకు రూ.10 లక్షలను అందించింది.  మీరా మాట్లాడుతూ..  స‌త్కారం అందుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపారు.

Read Also:

 UP ఉచిత టాబ్లెట్ స్మార్ట్‌ఫోన్ పథకం ప్ర‌యోజ‌నాలు పొందాలంటే..  DG శక్తి పోర్టల్ లో ముందుగా పేరు న‌మోదు చేసుకోవాలి. ఈ పోర్ట‌ల్ కు విద్యార్థుల డేటా అనుసంధానం చేయ‌బ‌డి ఉంటుంది.  ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని అర్హతలు మరియు ప్రమాణాలు కూడా సెట్ చేయబడ్డాయి, 

అర్హ‌త‌లు:
 

* ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి  చెందినవారై ఉండాలి. 
*తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసం చేసి ఉండాలి.
* విద్యార్థి కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 2 లక్షలకు మించకూడదు,  
* ఈ ప‌థ‌కానికి అఫ్లై చేసిన విధ్యార్థికి ఎలాంటి  బ్యాక్‌లాగ్ ఉండ‌కూడ‌దు.  ఉత్తీర్ణత తప్పనిసరి.

* కావలసిన డాక్యుమెంట్‌లు

 * విద్యార్థి ఆధార్ కార్డు
* ప్రభుత్వ పాఠశాల గుర్తింపు కార్డు
* UP స్థానికుడిని గుర్తించడానికి నివాస ధృవీకరణ పత్రం
* విద్యార్థి మరియు తల్లిదండ్రుల మొబైల్ నంబర్
 * పాస్‌పోర్ట్ సైజు ఫోటో ...  ముందుగా  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios