ఉత్తర ప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలోని వివిధ నగరాల పేర్లను మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా హిందూ మతానికి మద్దతుగా నిలుస్తూ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే తాను దేశ చరిత్రను భావితరాలకు అందించడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు యోగి కూడా వారికి సమాధానమిస్తున్నారు. ఇలా తమ ప్రభుత్వంపై పై వస్తున్న ఆరోపణలను పట్టించుకోకుండా యోగి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

వచ్చే ఏడాది జనవరి నుండి మార్చి వరకు మహా కుంభమేళ జరగనుంది. ఈ సందర్భంగా ప్రయాగ రాజ్ (అలహాబాద్) కు వివిధ రాష్ట్రాల నుండే కాకుండా యూపిలోని ఇతర ప్రాంతాల నుండి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి ఈ కుంభమేళాలో పాల్గొంటారు. అందువల్ల వారికి సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ఈ మూడు నెలల పాటు అలహాబాద్ లో జరిగే పెళ్లిళ్లను నిషేదిస్తూ యోగి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జనవరి-మార్చి మధ్య కాలంలో పెళ్లిళ్లు పెట్టుకున్న వారు ఈ విషయాన్ని గమనించాలని సర్కారు సూచించింది. తమ ఆదేశాలను దిక్కరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక కళ్యాణ మండపాలు,హోటళ్లు కూడా ముందస్తుగా పెళ్లిళ్ల కోసం ఏమైనా బుకింగ్స్ వుంటే రద్దుచేసుకోవాలని అధికారులు ఆదేశించారు. యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్లు ప్రజల్లో మిశ్రమ స్పందన వెలువడుతోంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 1, 2018, 7:06 PM IST