లక్నో: మూడేళ్ల వయస్సు గల బాలిక నోట్లో ఓ యువకుడు క్రాకర్ పెట్టి కాల్చాడు. దీపావళి సందర్భంగా మీరట్ లో అతను ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఈ సంఘటన మంగళవారంనాడు మిలాక్ గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అతని కోసం గాలిస్తున్నారు. బాలిక తండ్రి శశి కుమార్ ఫిర్యాదులో నిందితుడి పేరును హర్పాల్ గా పేర్కోనాడు. 

ఇంటి ముందు ఆడుకుంటున్న తన కూతురు వద్ద హర్పాల్ వచ్చి ఆమె నోట్లో సుతిల్ బాంబు పెట్టి ఫ్యూజ్ కు నిప్పంటించాడని ఆయన ఫిర్యాదు చేశారు. బాంబు బాలిక నోట్లో పేలింది. దాంతో బాలిక తీవ్రంగా గాయపడింది. 

బాలిక నోటికి 50 కుట్లు పడ్డాయి. ఆమె గొంతుకు కూడా ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెప్పారు. దాంతో ఆమె ఆరోగ్యం మరింతగా విషమించింది.