లక్నో: ఉత్తరప్రదేశ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే సహాయకుడు పోలీసు కాల్పుల్లో మరణించాడు. గత వారం జరిగిన ఎనిమిది పోలీసులు హత్య కేసులో వికాస్ దూబే ప్రధాన నిందితుడు. 

వికాస్ దూబే ముఠాలో షూటర్ అయిన అమర్ దూబే బుధవారం ఉదయం పోలీసు కాల్పుల్లో మరణించాడు. పోలీసులపై జరిగిన మెరుపుదాడిలో ఇతను కూడా పాల్గొన్నాడు. 

లక్నోకు 150 కిలోమీటర్ల దూరంలో హమీర్ పూర్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ స్పషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) తో జరిగిన ఎదురుకాల్పుల్లో అతను మరణించాడు.

వికాస్ దూబే మంగళవారంనాడు హర్యానాలోని ఫరీదాబాదు గల ఓ హోటల్లో కనిపించినట్లు తెలుస్తోంది. ఫరీదాబాద్ హోటల్ పై పోలీసులు దాడి చేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే, వికాస్ దూబే తప్పించుకుని పారిపోయాడు. దాంతో ఢిల్లీకి సమీపంలో గల ఫరీదాబాద్, గుర్గావ్ నగరాల్లో అప్రమత్తం చేశారు. ఢిల్లీ పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.