ఉత్తరప్రదేశ్ లో జరిగిన రెండు దశల ఎన్నికల్లో ప్రజలు సీఎం యోగి ఆదిత్యనాథ్ అహంకారాన్ని అణిచివేశారని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన బుందేల్ ఖండ్ నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొని మాట్లాడారు. 

UP Election News 2022 : ఉత్త‌రప్ర‌దేశ్ (uthar pradesh) లో సోమ‌వారం రెండో ద‌శ అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. ఈ ఎన్నిక‌లు ఎస్పీ, ఆర్ఎల్ డీ (SP-RLD) అభ్యర్థులకు ‘‘చారిత్రక ఓటింగ్ ’’ అని అఖిలేష్ యాదవ్ అభివర్ణించారు. (akhilesh yadav) యూపీలో మొదటి, రెండు దశల్లో జరిగిన ఎన్నిక‌ల్లో సీఎం యోగి ఆదిత్య‌నాథ్ (cm yogi adityanath) ‘‘గర్మీ’’ (అహంకారం)ను ప్ర‌జ‌లు అణ‌చివేశార‌ని అన్నారు. ఎన్నిక‌ల త‌రువాత SP, RLD నాయకుల ‘‘ఖూన్ కీ గార్మీ’’ (అహంకారం, ఉత్సాహం) అణిచివేస్తామని ఎన్నిక‌ల‌కు ముందు యోగి ఆదిత్య‌నాథ్ అన్నార‌ని అఖిలేష్ యాద‌వ్ మండిప‌డ్డారు. 

సోమవారం బుందేల్‌ఖండ్ (Bundelkhand) ప్రాంతంలో నిర్వ‌హించిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి అఖిలేష్ యాద‌వ్ మాట్లాడారు. ‘‘మొదటి రెండు దశల ఎన్నిక‌ల తర్వాత ఇతరుల ఉత్సాహాన్ని (గర్మి నికల్ డెంగే) అరికట్టాలని మాట్లాడిన వారి 'గార్మి'ని ప్రజలు శాంతింపజేశారు. ఇప్పుడు మూడో దశ ఎన్నిక‌ల తర్వాత బుందేల్‌ఖండ్ ప్రజలు కూడా అతడిని ‘తండా’ (కూల్ డౌన్) చేస్తారు.’’ అని అన్నారు. అనంతరం ఝాన్సీ, హమీర్‌పూర్, మహోబాలో జరిగిన ర్యాలీల్లో ఆయన ప్రసంగించారు. 

తొలి దశలో ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ (SP-RLD) కూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఓటింగ్‌ జరిగిందని.. రెండో దశలో కూడా అదే పరిస్థితి ఉందని అఖిలేష్ యాదవ్ అన్నారు. బుందేల్‌ఖండ్‌ ప్రజలకు ఎస్పీ అండగా ఉందని, అయితే బీజేపీ మాత్రం ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఓటమి దిశగా పయనిస్తోందని అన్నారు. మారుతున్న భాషని బట్టి అది స్పష్టంగా కనిపిస్తోంది అన్నారు. బీజేపీ (bjp) నాయకులు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని విమ‌ర్శించారు. కులం, మతం ప్రాతిపదికన ఎలాంటి వివక్ష లేకుండా ఎన్నికల్లో SP-RLD కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో త‌మ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన వెంట‌నే ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తాన‌ని హామీ ఇచ్చారు. యువ‌కుల‌కు ఉపాధి క‌ల్పిస్తామ‌ని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మూడు నెలల్లో రాష్ట్రంలో కుల గణన చేపడతామని అన్నారు. అన్ని కులాల ప్రజలకు రిజర్వేషన్లు, సముచిత హక్కులు కల్పిస్తామ‌ని తెలిపారు. బీజేపీ చేసిన అన్ని వివక్షలను తాను తొలగిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ ఎప్పటికీ కుల గణన చేపట్టబోద‌ని, కేవలం ప్రజలను పోరాడేలా చేస్తుందని తెలిపారు. 

దేశంలో యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు అతి పెద్ద‌వ‌ని, యూపీని కాపాడితే దేశానికి ర‌క్ష‌ణ వ‌స్తుంద‌ని అఖిలేష్ యాద‌వ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం బుందేల్‌ఖండ్ (Bundelkhand) ప్రాంత అభివృద్ధిని విస్మరించిందని, అందుకే ఈ ప్రాంతం వెన‌క‌బ‌డి ఉంద‌ని ఆరోపించారు. ఎస్పీ-ఆర్‌ఎల్‌డి అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తూ.. బీజేపీ వ‌ల్ల రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, అభివృద్ధికి ముప్పు అని విమ‌ర్శించారు. బుందేల్‌ఖండ్‌లో పరిశ్రమలు ఎక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు స్థాపించారని ప్ర‌జ‌లను ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుత బీజేపీ పాల‌న‌లో అవినీతి వ‌ల్ల ఆదాయం సగానికి సగం తగ్గింద‌ని, ద్రవ్యోల్బణం రెండింతలు పెరిగింద‌ని ఆరోపించారు. ఉద్యోగాలు ఇచ్చామని తప్పుడు ప్రకటనలు ఇచ్చార‌ని విమ‌ర్శించారు.