06:57 PM (IST) Feb 10

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. 5 గంటల వరకు 58 శాతం ఓటింగ్ నమోదు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సమయం ముగిసినప్పటికీ ఇంకా క్యూలైన్‌లోనే వున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పారు. 

04:17 PM (IST) Feb 10

3 గంటల వరకు 44.94 శాతం పోలింగ్

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నాం 3 గంటల వరకు 44.94 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 

03:09 PM (IST) Feb 10

ప్రశాంతంగా పోలింగ్.. కొన్ని చోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 35 శాతం పోలింగ్ నమోదైంది. అయితే పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినట్లుగా తెలుస్తోంది. దీంతో నిపుణులు వాటిని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

01:56 PM (IST) Feb 10

మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లాల వారిగా పోలింగ్ శాతం వివరాలు

యూపీలో మొదటిదశ ఎన్నిక జరుగుతున్న జిల్లాలో అత్యధికంగా శామ్లీలో 41శాతం పోలింగ్ నమోదయ్యింది. అత్యల్పంగా అలీఘడ్ లో 32.07శాతం పోలింగ్ నమోదయ్యింది. 

Scroll to load tweet…

01:52 PM (IST) Feb 10

మధ్యాహ్నం ఒంటిగంట వరకు 35.03శాతం పోలింగ్

ఉత్తర ప్రదేశ్ లో మొదటి దశ పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా సాగుతోంది. ఇప్పటివరకు అంటే మధ్యాహ్నం ఒంటిగంట వరకు 35.03శాతం పోలింగ్ నమోదయ్యింది. 

01:34 PM (IST) Feb 10

బాగ్ పత్ లో 37.91శాతం పోలింగ్

బాగ్ పత్ జిల్లాలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 37.91 శాతం పోలింగ్ నమోదయ్యింది.

01:28 PM (IST) Feb 10

నా పరిస్థితి ఇదీ... అయినా ఓటేస్తా...: ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి

తనకు మధురలో ఓటుహక్కు వుందని...కానీ తాను ప్రస్తుతం తాను బిజ్నోర్ లో ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్నట్లు ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి తెలిపారు. ఇప్పటికే తన భార్య ఓటేసిందని... తాను కూడా ఓటు వేయడానికి ప్రయత్నిస్తానని జయంత్ తెలిపారు. ప్రచారాన్ని త్వరగా ముగించుకుని మధురకు బయలుదేరతానని ఆయన తెలిపారు..


01:04 PM (IST) Feb 10

దొంగ ఓట్ల ఆరోపణలు...మేరట్ లో సమాజ్ వాది-బిజెపి నాయకులు బహాబాహీ

మేరట్ జిల్లా కిటౌర్ నియోజకవర్గం భడౌలీ గ్రామంలో సమాజ్ వాది పార్టీ-బిజెపి శ్రేణులు బాహాబాహీకి దిగారు. దొంగఓట్లు వేయిస్తున్నారంటే ఓ పార్టీ నాయకులపై మరో పార్టీ నాయకలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణ ఏర్పడింది. పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

12:53 PM (IST) Feb 10

ముజఫర్ నగర్ లో ఓటేసిన 105 సంవత్సరాల వృద్దురాలు

ఉత్తర ప్రదేశ్ లో మొదటిదశ ఎన్నికల్లో భాగంగా ముజఫర్ నగర్ లో ఇవాళ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ పోలింగ్ కేంద్రానికి ఓటేయడానికి వచ్చిన 105ఏళ్ళ వృద్దురాలిని చూసి అందూ ఆశ్చర్యపోయారు. ఈ వయసులోనే ఓటేయడానికి వచ్చిన ఆమె తరం యువతీయువకులు ఆదర్శంగా నిలిచారు. కొంత సమయం కేటాయించి ఓటేయడానికే బద్దకిస్తున్నవారికి ఈ వృద్దురాలిని చూసయినా మారాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతులున్నారు.

Scroll to load tweet…

12:36 PM (IST) Feb 10

మధురలో ఓటేసిన దేవకీనందన్ మహరాజ్

మధురలో దేవకీనందన్ ఠాకూర్ జీ మహరాజ్ కుటుంబసభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. కృష్ణా నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో ఆయన ఓటేసారు. 

12:22 PM (IST) Feb 10

ముజఫర్ నగర్ లో ఓటేసిన కేంద్ర మంత్రి

యూపీలో జరుగుతున్న మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటుహక్కను వినియోగించుకున్నారు. తాజాగా ముజఫర్ నగర్ లోని ఓ పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి సంజీవ్ భల్యాన్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

Scroll to load tweet…
11:57 AM (IST) Feb 10

జిల్లాల వారిగా పోలింగ్ శాతం....

మొదటిదశలో పోలింగ్ జరుగుతున్న 11 జిల్లాల్లో అత్యధికంగా శామ్లీ లో అత్యధికంగా 22.83శాతం, అత్యల్ఫంగా అలీఘడ్ లో 17.91శాతం పోలింగ్ నమోదయ్యింది.

Scroll to load tweet…


11:51 AM (IST) Feb 10

ఊపందుకున్న పోలింగ్... నాలుగు గంటల్లో 20శాతం

ఉత్తర ప్రదేశ్ లో మెదటి దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఆరంభంలో కాస్త మందకోడిగా సాగినా ప్రస్తుతం ఊపందుకుంది. 11 గంటల వరకు అంటే నాలుగుగంటల్లో 20శాతం పోలింగ్ నమోదయ్యింది. 

11:43 AM (IST) Feb 10

ఓటు ముందు ఆ తర్వాతే పెళ్లి... ముజఫర్ నగర్ లో ఓటేసిన పెళ్లికొడుకు

ఇవాళ అతడి పెళ్లి. అయినా ఓటుహక్కును వినియోగించుకునేందుకు పెళ్ళికొడుకు పోలింగ్ బూత్ కు కదిలాడు. 'ముందు ఓటు... ఆ తర్వాతే పెళ్ళి' అంటూ ముజఫర్ నగర్ కు చెందిన అంకుర్ అనే యువకుడు పెళ్ళికొడుకు వేషంలోనే ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Scroll to load tweet…


11:33 AM (IST) Feb 10

ఓటుహక్కును వినియోగించుకోని జయంత్ చౌదరి

మధురలో తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న ఆయన ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి ఓటుహక్కును వినియోగించుకోలేకపోతున్నాడు. ఆయన ఇవాళ పోలింగ్ లో పాల్గోనడం లేదని పార్టీ వర్గాలు తెలిపారు.

Scroll to load tweet…


11:09 AM (IST) Feb 10

ఆదర్శ ఓటర్...

Scroll to load tweet…
10:59 AM (IST) Feb 10

మేరట్ లో ఓటేసిన శతాదిక వృద్దురాలు

 ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న మొదటిదశ పోలింగ్ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా వృద్దులు చలినిసైతం లెక్కచేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇలా మేరట్ లో 101 సంవత్సరాల వృద్దురాలు ఓటుహక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచింది. ఓటు హక్కు వినియోగించుకోకుండా నిర్లక్ష్యం వహించేవారు ఈ వృద్దురాలిని చూసయినా మారాలి. 


10:32 AM (IST) Feb 10

ఆదర్శ ఓటర్లు... చల్లటి చలిలో పొగమంచులోనే ఓటేసేందుకు కదిలిన వృద్దులు

Scroll to load tweet…
10:24 AM (IST) Feb 10

శామ్లీలో శాంతియుతంగా పోలింగ్...: కలెక్టర్

శామ్లీ జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని జిల్లా కలెక్టర్ జస్జిత్ కౌర్ తెలిపారు. అక్కడక్కడ ఈవీఎం సమస్యలు తలెత్తగా వెంటనే ఆయా పోలింగ్ బూతుల్లో సమస్యను పరిష్కరించే ప్రయత్న చేస్తున్నామన్నారు. ఎక్కడా శాంతిభద్రతల సమస్య లేదని కలెక్టర్ వెల్లడించారు. 

Scroll to load tweet…

10:13 AM (IST) Feb 10

దక్షిణ ఆగ్రాలో ఓటేసిన కేంద్ర మంత్రి బగేల్

కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బగేల్ దక్షిణ ఆగ్రా నియోజకవర్గంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

Scroll to load tweet…