Asianet News TeluguAsianet News Telugu

UP Elections 2022: యూపీ కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థిగా ప్రియాంక గాంధీ ! అలా క్లారిటీ

UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. పోలింగ్ తేదీ స‌మీపిస్తున్న‌ కొద్దీ..  పొలిటికల్ డ్రామా మ‌రింత ర‌క్తి కడుతోంది. యూపీ  కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ప్రియాంక గాంధీ వార్థా క్లారిటీ ఇచ్చింది.
 

UP election: After major hint on Congress CM face  a clarification from Priyanka Gandhi
Author
Hyderabad, First Published Jan 22, 2022, 12:31 PM IST

UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. పోలింగ్ తేదీ స‌మీపిస్తున్న‌ కొద్దీ..  పొలిటికల్ డ్రామా మ‌రింత ర‌క్తి కడుతోంది. ఈ త‌రుణంలో వివిధ పార్టీల నేతలు ఫిరాయింపుల పర్వానికి తెరలేపారు. వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్న దృష్ట్యా పలు పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు టికెట్ల కోసం పార్టీలు మారుతున్నారు.

ఇదిలా ఉంటే..  యూపీ కాంగ్రెస్ బాధ్య‌త‌ల‌ను భుజాన‌వేసుకుని ముందుకు వెళ్తున్నారు  కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, యూపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ప్రియాంకా గాంధీ. ఇప్ప‌టికే బీజేపీ, స‌మాజ్ వాదీ పార్టీలు  సీఎం అభ్య‌ర్థులు ప్ర‌క‌టించారు. కానీ కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ నే కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. సోష‌ల్ మీడియాలో కూడా ప్ర‌చారం జోరుగా సాగుతోంది. 

ఇప్ప‌టికే.. ప‌లు మార్లు తానే ముఖ్యమంత్రి అని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. పదేపదే అదే ప్రశ్నను అడగడం వల్ల చిరాకు వ‌స్తుందని అన్నారు. ఇంకెవరైనా కనిపిస్తున్నారా ?. నన్నే ఎందుకు అనుకోకూడదు..?” అని  ప్ర‌శ్నించచారు.  ఆ వెంట‌నే తాను ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పారు.

శుక్రవారం, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో 'భారతీ విధాన్' అనే ఉత్తరప్రదేశ్ యూత్ మ్యానిఫెస్టోను ప్రారంభించారు. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరు ? అనే  మీడియా ప్ర‌శ్నించింది.  ఈ విష‌యంపై మ‌రోసారి జాతీయ మీడియా ప్రియాంక గాంధీ వాద్రాను సంప్ర‌దించింది. “నేను (ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో (కాంగ్రెస్ సీఎం) అని చెప్పడం లేదు... మీరందరూ మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి (మీకు ప్రతిచోటా నా ముఖం కనిపిస్తుంది) చికాకుతో అన్నాను. ” అని  ప్రియాంక గాంధీ  అన్నారు. అదే స‌మయంలో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మినహా ఏ పార్టీతోనైనా ఎన్నికల తర్వాత పొత్తుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు.

 ఈ త‌రుణంలో మాయావ‌తిని ఆమె టార్గెట్ చేశారు.  యూపీ ఎన్నికల్లో మాయావతి ఎందుకు సైలెంట్‌గా ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. ఆమె వ్య‌వ‌హార శైలి చాలా ఆశ్చర్యంగా ఉండ‌ని అన్నారు. 

మ‌రోవైపు సీఎం యోగి పై టార్గెట్ చేసింది. నిరుద్యోగ సమస్యను లేవ‌నెత్తింది. 80% వర్సెస్ 20% పోరాటం కాదని, నిజం ఏంటంటే.. 99 శాతం వ‌ర్సెస్ 1 శాత‌మే అన్నారు. ఈ దేశంలో, యూపీతో సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బడా వ్యాపారవేత్తలు, పాల‌కుల‌ స్నేహితులు కొద్దిమంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు, అందరూ చాలా బాధలో ఉన్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ప్రియాంక గాంధీ.“యుపిలో నిరుద్యోగుల శాతం గురించి మనం ఎందుకు మాట్లాడటం లేదు? విద్యారంగానికి ప్రభుత్వం వెచ్చిస్తున్న బడ్జెట్‌పై ఎందుకు మాట్లాడటం లేదు? యూపీ పురోగతితో సంబంధం లేని ప్రశ్నలను ఎందుకు సంధిస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థుల‌పై క్లారిటీ ఇవ్వ‌లేద‌ని, యూపీలోనే కాకుండా ఇత‌ర రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు, అయితే బీజేపీ, ఇత‌ర పార్టీలు మాత్రంసీఎం అభ్యర్థులను ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27 మార్చి 3, 7 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios