రోగి కడుపు నుండి స్టీల్ గ్లాస్ వెలికి తీసిన వైద్యులు

UP: Doctors remove steel glass from patient's stomach in Kanpur
Highlights

65 ఏళ్ల రామ్‌ధీన్ అనే వ్యక్తి కడుపులో నుండి స్టీల్ గ్లాస్ ను వైద్యులు తొలగించారు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న రామ్‌ధీన్ ఆసుపత్రిలో చేరడంతో వైద్యులు పరీక్షించి ఆయన కడుపు నుండి స్టీల్ గ్లాస్ ను వెలికి తీశారు.


లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఓ రోగి కడుపు నుండి  స్టీల్  గ్లాసును  తొలగించారు.  తరచూ కడుపు నొప్పి వస్తోందని  ఆసుపత్రికి వెళ్లిన  రోగిని పరీక్షించి వైద్యులు శస్త్రచికిత్స చేసి  ఆ గ్లాసును తొలగించారు.  రెండు గంటలపాటు  వైద్యులు ఆపరేషణ్ నిర్వహించి  ఈ గ్లాసును తొలగించారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌ కు చెందిన 62 ఏళ్ల రామ్‌దీన్ అనే  వ్యక్తి  తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో ఆయన స్థానిక రామా ఆసుపత్రిలో చేరారు.  తనకు తరచూ కడుపునొప్పి వస్తోందని వైద్యులకు చెప్పారు.

అయితే  వైద్యులు రామ్‌ధీన్ కు ఎక్స్‌రే తీశారు. అయితే అతడి కడుపులో  స్టీల్ గ్లాస్ ఉన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. రెండు గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి స్టీల్ గ్లాస్ ను బయటకు తీశారు.

పది రోజుల క్రితం తనపై కొందరు దుండగులు దాడి చేసి తన కడుపులోకి స్టీల్ గ్లాసును పంపారని బాధితుడు చెబుతున్నారు.  అప్పటి నుండి తాను తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్టు చెప్పారు.

loader