Asianet News TeluguAsianet News Telugu

మహిళ ఎదురుగా ఎస్ఐ వికృత చర్య.. వీడియో తీసి

ఈ దరిద్రాన్ని సదరు మహిళ సీక్రెట్‌ కెమరాతో రికార్డు చేసి సోషల్‌ మీడయాలో అప్‌లోడ్‌ చేసింది. ఈ వీడియో వైరల్‌ కావడం.. సదరు ఎస్సై ప్రవర్తన మీద ఆగ్రహం వ్యక్తం కావడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్‌ చేశారు. 
 

UP cop masturbates in front of women at police station, video goes viral
Author
Hyderabad, First Published Jul 1, 2020, 1:47 PM IST

ఓ మహిళ ఎదురుగా ఎస్ఐ వికృత చర్యకు పాల్పడ్డాడు. భూ వివాదం గురించి ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ ఎదురుగా ఎస్సై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ దరిద్రాన్ని సదరు మహిళ రహస్యంగా వీడియో తీసి సోషల్‌ మీడయాలో షేర్‌ చేయడంతో ఎస్సైని సస్పెండ్‌ చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ డియోరియాలోని భట్ని పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. 

ఓ మహిళ భూ వివాదం గురించి ఫిర్యాదు చేయడానికి భట్ని పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ పని చేసే ఎస్సై భీష్మ్ పాల్ సింగ్‌ ఫిర్యాదు గురించి సదరు మహిళతో మాట్లాడాలంటూ తన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఎదురుగా హస్తప్రయోగం చేసుకుంటూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. 

ఈ దరిద్రాన్ని సదరు మహిళ సీక్రెట్‌ కెమరాతో రికార్డు చేసి సోషల్‌ మీడయాలో అప్‌లోడ్‌ చేసింది. ఈ వీడియో వైరల్‌ కావడం.. సదరు ఎస్సై ప్రవర్తన మీద ఆగ్రహం వ్యక్తం కావడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్‌ చేశారు. 

ఈ క్రమంలో సదరు మహిళ మాట్లాడుతూ.. ‘భూ సమస్య పరిష్కారం కోసం నేను ఇప్పటికి పలుమార్లు ఈ పోలీసు స్టేషన్‌కు వచ్చాను. గతంలో 2, 3 సార్లు ఆ ఎస్సై ఇలానే ప్రవర్తించాడు. దీని గురించి నా స్నేహితురాలికి చెప్పాను. అప్పుడు ఆమె గతంలో భీష్మ్‌ పాల్‌ సింగ్‌ తన ముందు కూడా ఇలానే ప్రవర్తించాడని చెప్పింది. అందుకే ఈ సారి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినప్పడు సీక్రెట్‌ కెమరా తీసుకెళ్లాను. అతడి నీచ బుద్ధిని అందరికి తెలియజేయాలని వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాను’ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios