రోజుకి దాదాపు 12 గంటలు పని చేయించుకుంటున్నారని వాపోయాడు. అంత పని చేయించుకొని కూడా నాసిరకం భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను గత రెండు రోజులుగా ఆహారం తీసుకోలేదని.. అయినా ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదన్నాడు.
పోలీసు అనగానే.. మనం వారిని సీరియస్ యాంగిల్ లోనే చూస్తాం. వాళ్లు గంభీరంగా ఉంటారని అనుకుంటాం. అందుకే చాలా మంది అసలు పోలీసు పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. కానీ.. ఒక పోలీసు అధికారి అందరూ చూస్తుండగా కన్నీళ్లు పెట్టుకోవడం మీరు ఊహించగలరా..? కానీ ఓ పోలీసు అలానే చేశాడు. తనకు మెస్ సిబ్బంది పెడుతున్న ఆహారం సరిగా లేదని కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. అతను ఏడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ లోకి ఓ పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ అతను. పేరు మనోజ్ కుమార్. కాగా.. అతను ఇటీవల చేతిలో భోజనం చేసే ప్లేట్ పట్టుకొని వచ్చి మరీ రోడ్డుపై తన బాధను వ్యక్తం చేశాడు. రోజుకి దాదాపు 12 గంటలు పని చేయించుకుంటున్నారని వాపోయాడు. అంత పని చేయించుకొని కూడా నాసిరకం భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను గత రెండు రోజులుగా ఆహారం తీసుకోలేదని.. అయినా ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదన్నాడు.
తమకు మెస్ సిబ్బంది పెట్టే ఆహారం సరిగా లేదని.. కనీసం జంతువులు కూడా ఆ ఆహారాన్ని తినడానికి ఇష్టపడవని చెప్పాడు. అతను ఇదంతా హైవే పై చెప్పడం గమనార్హం. అక్కడ ఉన్న స్థానికులకు తమకు పెట్టే ఆహారాన్ని చూపిస్తూ కానిస్టేబుల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సరైన ఆహారం పెట్టకుంటే.. తాము సరిగా ఎలా డ్యూటీ చేయగలుగుతామని ప్రశ్నించాడు. అతని బాధ మొత్తాన్ని స్థానికులు వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.
అయితే... కానిస్టేబుల్ ఆవేదనపై ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. కానిస్టేబుల్ మనోజ్ కుమార్ కి కుటుంబ సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఆయన తరచూ తన భార్యతో గొడవ పడుతూ ఉంటాడని.. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని చెప్పారు. సరిగా ఇలాంటి సమయంలోనే మెస్ లో భోజనం చేయడానికి వెళితే అక్కడ క్యూ ఉండటంతో.. అసహనం చెంది ఇలా మాట్లాడాడని ఆయన చెప్పారు. భోజనం ప్లేట్ తీసుకొని కూడా తినకుండా.. హై వే పైకి వచ్చి ఇలా మాట్లాడాడని అధికారులు చెబుతున్నారు.
