ఉత్తర ప్రదేశ్ లో వృద్దాప్య పెన్షన్ ఎంతిస్తారో తెలుసా?
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మాదిరిగానే ఉత్తర ప్రదేశ్ లో కూడా యోగి సర్కార్ వృద్దాప్య పెన్షన్లు అందిస్తోంది. ప్రతి నెలా ఎంత పెన్షన్ ఇస్తుందో తెలుసా?
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని 56 లక్షల మంది పేద వృద్ధులకు పెన్షన్ ఇస్తామన్న మాట నిలబెట్టుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే 56 లక్షల మంది పేద వృద్ధుల ఖాతాల్లోకి నెలకు రూ.1000 చొప్పున పెన్షన్ జమ అయ్యింది.
సీఎం యోగి తన ప్రజా సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి వర్గం ప్రగతికి బాటలు వేసేలా చూస్తున్నారు. అందుకే ఉత్తరప్రదేశ్ నేడు అభివృద్ధి బాటలో పరుగులు తీస్తోంది. ఈ పథకాల్లో భాగంగా రాష్ట్రంలోని వృద్ధుల సంక్షేమానికి కూడా యోగి ప్రాధాన్యత ఇచ్చారు. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఉండేందుకు యోగి ప్రభుత్వం పెన్షన్ పథకం ద్వారా వారిని ఆర్థిక భరోసా కల్పిస్తోంది.
వృద్ధులకు ఆర్థిక సహాయం అందించడమే యోగి ప్రభుత్వం ఈ చర్య ఉద్దేశ్యం. దీనివల్ల వారు తమ జీవిత చరమాంకంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడకుండా గౌరవంగా జీవించగలుగుతారు. సీఎం యోగి ఆదేశాల మేరకు అధికారులు బ్లాక్, గ్రామ పంచాయతీ స్థాయిల్లో అర్హులైన వృద్ధులను గుర్తించారు. నిర్ణయించిన లక్ష్యం కంటే ఎక్కువ మంది వృద్ధులు ఉంటే వారికి కూడా ఈ పథకం ప్రయోజనం లభిస్తుంది. సీఎం యోగి పనితీరు, సమాజ సంక్షేమ శాఖ పారదర్శకత వల్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే లక్ష్యాన్ని చేరుకోగలిగారు.
రాష్ట్రంలో వృద్ధులకు ఈ పథకం వరంలాంటిది. వృద్ధాప్య పెన్షన్ పథకం కింద 60 ఏళ్లు పైబడి, ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులకు ప్రతి నెలా రూ.1000 పెన్షన్ లభిస్తోంది. దీంతో వారి జీవనోపాధికి సహాయం అందుతోంది. గణాంకాల ప్రకారం, 2023-24లో 55,68,590 మంది వృద్ధులు ఈ పథకం ప్రయోజనం పొందారు. 2024-25 మొదటి త్రైమాసికంలో 55,99,997 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి పెన్షన్ డబ్బులు నేరుగా జమ చేశారు.
డిజిటల్ పద్దతిలో వృద్దాప్య పెన్షన్
యోగి ప్రభుత్వం వృద్ధులకు పథకం ప్రయోజనం చేకూర్చేందుకు మొత్తం ప్రక్రియను డిజిటల్, పారదర్శకంగా మార్చింది. ఇప్పుడు ఎవరైనా అర్హులైన వ్యక్తి ఉత్తరప్రదేశ్ సమాజ సంక్షేమ శాఖ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, పట్టణ ప్రాంతాల్లో సబ్ కలెక్టర్ దరఖాస్తును ధృవీకరిస్తారు.
ఈ పథకం ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన వృద్ధుల కోసం రూపొందించారు. వారు పెన్షన్ ద్వారా తమ జీవిత అవసరాలను తీర్చుకోగలుగుతారు. వృద్ధాప్య పెన్షన్ పథకం కింద ప్రయోజనం పొందాలంటే దరఖాస్తుదారు వయస్సు 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే వారి ఆదాయం నిర్ణీత ఆదాయ పరిమితిలోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయ పరిమితి రూ.56,460 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.46,080 లోపు వుండాలి.
పథకం లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది
గత కొన్నేళ్లుగా ఈ పథకం కింద లబ్ధిదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. 2018-19లో 40,71,580 మంది వృద్ధులు ఈ పథకం ప్రయోజనం పొందగా, 2019-20లో ఈ సంఖ్య 47,99,480కి పెరిగింది. 2020-21లో 51,24,155 మంది, 2021-22లో 51,92,779 మంది, 2022-23లో 54,97,237 మందికి చేరింది. ఇక 2023-24లో 55,68,590నుండి 2024-25 మొదటి త్రైమాసికంలో 55,99,997 లక్షల మందికి లబ్ధిదారుల సంఖ్య పెరిగింది.
ఈ పథకం కేవలం ఆర్థిక సహాయానికే పరిమితం కాదు. వృద్ధులకు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత లభించడం వల్ల వృద్ధుల్లో ఆత్మగౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా ఇతర ఆదాయ మార్గాలు లేని వృద్ధులకు ఈ పెన్షన్ ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ప్రభుత్వం ఈ పథకం ద్వారా వృద్ధులు తమ దైనందిన అవసరాలను తీర్చుకోవడమే కాకుండా, కుటుంబంపై ఆర్థికంగా ఆధారపడటం కూడా తగ్గుతుంది. ఈ పథకం వృద్ధుల పట్ల ప్రభుత్వ సేవా నిబద్ధతను చాటుతుంది.