ఈ అద్భుత కళాకృతులకు యోగి బ్రాండింగ్ ... డిమాండ్ ఎలా వుందో తెలుసా?
గోరఖ్‌పూర్‌లోని టెర్రకోట కళాకారులకు ఈసారి దీపావళి ముందే వచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ చొరవతో ఈ కళాకారుల జీవితాలు మారిపోయాయి.
గోరఖ్‌పూర్ : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చొరవతో హస్తకళాకారులకు మంచి ఉపాధి లభిస్తోంది. యూపీ పాలనాపగ్గాలు చేపట్టిన తర్వాత యోగి 2018 లో టెర్రకోట కళను ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఒడిఒపి) లో చేర్చారు. దీంతో ఆ కళాకారులకు మంచి రోజులు వచ్చాయి. ఒడిఒపిలో చేరకముందు కళాకారులు కష్టాలు పడ్డారు... మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా టెర్రకోట వస్తువులకు డిమాండ్ పెరిగింది.
ఏటేటా టెర్రకోట ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటంతో కళాకారులకు చేతినిండా పని వుంటోంది. దీంతో వారు ఆర్థిక కష్టాలు లేకుండా పిల్లాపాపలతో హాయిగా జీవిస్తున్నారు. . దేశంలోని వివిధ రాష్ట్రాలకు దాదాపు 30 ట్రక్కుల టెర్రకోట ఉత్పత్తులను సరఫరా అవుతున్నాయి. ఇప్పుడు ఈ కళాకారులు దీపావళి పండగవేళ స్థానిక మార్కెట్ కోసం ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.
దసరా, దీపావళి కోసం గోరఖ్‌పూర్ టెర్రకోట ఉత్పత్తులకు గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు డిమాండ్ పెరిగింది. పండుగ డిమాండ్‌ను కళాకారులు నవరాత్రి ముందే తీర్చారు. జాతీయ అవార్డు గ్రహీత టెర్రకోట కళాకారుడు రాజన్ ప్రజాపతి మాట్లాడుతూ... ఈసారి దసరా, దీపావళి కోసం 15 ట్రక్కుల ఉత్పత్తులను హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, లక్నో నగరాలకు సరఫరా చేశానని చెప్పారు. అయితే గత సంవత్సరం 8 ట్రక్కుల టెర్రకోట ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు... ఈ ఏడాది ఇది రెట్టింపు అయ్యిందని రాజన్ తెలిపారు.
ఈసారి రాజన్ ప్రజాపతితో పాటు పన్నాలాల్ ప్రజాపతి 8 ట్రక్కులు, హరిఓం ఆజాద్ 2 ట్రక్కులు, మోహన్‌లాల్, సోహన్‌లాల్ ప్రజాపతి 2 ట్రక్కులు, హీరాలాల్ ప్రజాపతి ఒక ట్రక్కు ఉత్పత్తులను సరఫరా చేశారు. వీరందరికీ వచ్చిన డిమాండ్‌లు నవరాత్రి, దసరా ముందే పూర్తయ్యాయి.
టెర్రకోట వస్తువులకు ఫుల్ డిమాండ్
టెర్రకోట కళాకారులు ఇప్పుడు దీపావళికి స్థానిక మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఒడిఒపిలో చేరిన తర్వాత స్థానిక మార్కెట్‌లో కూడా టెర్రకోట కళలకు డిమాండ్ రెట్టింపు అయ్యింది.
టెర్రకోట మార్కెట్‌లో వచ్చిన ఈ మార్పుకు కారణం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అని కళాకారులందరూ అంటున్నారు. తమకు వస్తువులను అమ్మడానికి ప్రకటన అవసరం లేదని, టెర్రకోట బ్రాండింగ్‌ను సిఎం యోగి బాగా చేశారని రాజన్ ప్రజాపతి పేర్కొన్నారు.
సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు గ్రేటర్ నోయిడాలో జరిగిన యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో గోరఖ్‌పూర్ టెర్రకోట కళలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇందులో పాల్గొన్న కళాకారులు, వ్యాపారులకు ప్రస్తుతం మంచి వ్యాపారం జరుగుతోంది.
టెర్రకోట కళను బ్రతికించారు :
యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యే ముందు టెర్రకోట కళాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం అస్సలు వుండేదికాదని కళాకారులు చెబుతున్నారు. మార్కెటింగ్ కు సరైన వేదిక లేకపోవడంతో ఈ కళ కనుమరుగవుతుందని ఆందోళనకు గురయ్యేవారమని అంటున్నారు. కానీ ఈ మట్టి కళకు యోగి ఆదిత్యనాథ్ జీవం పోశారు... ఆయన సీఎం అయిన వెంటనే. 2018లో టెర్రకోటను ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకంలో చేర్చారు. అప్పటి నుంచి ఈ కళ కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని కళాకారులు అంటున్నారు.
ఒడిఒపిలో చేరిన తర్వాత ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రోత్సాహంతో టెర్రకోట వ్యాపారం ఏటేటా విస్తరిస్తోందని అంటున్నారు. పాత కళాకారులకు చేతినిండా పని దొరుకుతోంది...దీంతో ఈ టెర్రకోటలో మంచి భవిష్యత్తు ఉందని చాలా మంది కొత్త కళాకారులు, వ్యాపారులు దీనిలో చేరుతున్నారు.
సిఎం యోగి టెర్రకోటను గోరఖ్‌పూర్ ఒడిఒపిగా ప్రకటించినప్పుడే మంచి రోజులు వచ్చాయి. ఒడిఒపిలో చేరిన తర్వాత టెర్రకోట కళాకారులకు వనరులు, ఆర్థిక, సాంకేతిక సహాయం లభించింది. సిఎం నాయకత్వంలో బ్రాండింగ్ బాగా జరిగింది. ఎలక్ట్రిక్ చాక్, పగ్‌మిల్, డిజైన్ మెషిన్లు లభించడంతో కళాకారుల పని సులభం అయ్యింది. ఉత్పాదకత మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగింది. నాణ్యత కూడా మెరుగైందని కళాకారులు చెబుతున్నారు.