సోషల్ మీడియాలో యోగి ప్రభంజనం ... ఏం ఫాలోయింగ్ సామీ!!

సీఎం యోగి ఆదిత్యనాథ్ జనాదరణ సోషల్ మీడియాలోనూ కనిపిస్తోంది. ఆయన కార్యాలయపు అధికారిక 'X' ఖాతాలో ఫాలోవర్స్ సంఖ్య 60 లక్షలు దాటింది. ప్రజలతో ఆయనకున్న అనుబంధానికి ఇది నిదర్శనం.

UP CM Yogi Adityanath X handle crosses 6 million followers AKP

లక్నో : యూపీలోని 25 కోట్ల మంది ప్రజలతో పాటు దేశంలో కూడా యోగి ఆదిత్యనాథ్ జనాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడంలో యోగి ముందుంటారు. సోషల్ మీడియాలోనూ ఆయన చురుగ్గా ఉంటారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిక 'X' ఖాతా (CM Office) లో ఫాలోవర్స్ సంఖ్య బాగా పెరిగింది. ఆదివారం నాటికి ఈ సంఖ్య 60 లక్షలు (ఆరు మిలియన్లు) చేరుకుంది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత 'X' ఖాతాలో 3.09 కోట్లు (30.9 మిలియన్లు), ఇన్‌స్టాగ్రామ్‌లో 1.31 కోట్లు (13.1 మిలియన్లు) మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదే క్రమంలో ఆదివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిక 'X' ఖాతాలో ఫాలోవర్స్ సంఖ్య 60 లక్షలు (ఆరు మిలియన్లు) చేరుకుంది.

యోగి ఆదిత్యనాథ్ వాట్సాప్ ఛానల్‌లో 35.36 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 2017లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సీఎం యోగి అభివృద్ధి, సుపరిపాలనతో పాటు చట్టం,  పరిస్థితుల్లో చేసిన మార్పుల వల్ల ఆయన జనాదరణ కొత్త శిఖరాలకు చేరుకుంది.

ప్రజలతో మమేకమైన సీఎం యోగి

యోగి ఆదిత్యనాథ్ ప్రజలతో మమేకమయ్యే గుణం కలిగిన వ్యక్తి.... ఏదైనా బహిరంగ కార్యక్రమంలో పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడతారు. 'జనతా దర్శన్' లో ప్రజల సమస్యలు వారి దగ్గరకు వెళ్లి విని, పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. యోగి ఆదిత్యనాథ్ పార్టీ కార్యకర్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో వారి ప్రాంతం గురించి క్రమం తప్పకుండా సంప్రదిస్తారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు ఇస్తారు. అందువల్లే ఆయనకు రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. అందుకు తాజాగా పెరిగిన ఫాలోవర్స్ సంఖ్యే నిదర్శనం. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios