ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తూ ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తూ ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో తీర్మానం చేసింది. అయితే ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల రాష్ట్రంలో నిరసన వ్యక్తమవుతోంది. యోగి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఎన్నికల సమయంలో లబ్ధి పొందేందుకే బీజేపీ ఇలాంటి ఎత్తుగడ వేసిందంటూ మండిపడుతున్నారు. ప్రజలపై బలవంతంగా హిందుత్వ ఎజెండాను రుద్దేందుకే సీఎం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ ఎస్పీ, కాంగ్రెస్‌లు ఆరోపించాయి. మరోవైపు మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆదిత్యనాథ్ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.