Asianet News TeluguAsianet News Telugu

చిరుత‌కు పాలు తాగించిన సీఎం యోగి.. నెట్టింట్లో వీడియో వైర‌ల్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం గోరఖ్‌పూర్‌లోని జూలో చిరుతపులి పిల్లకు పాలు తినిపించారు.  అలాగే.. రెండు చిరుత పిల్ల‌ల‌కు నామ‌క‌ర‌ణం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది.

UP CM Yogi Adityanath feeds milk to leopard cub at Gorakhpur zoo
Author
First Published Oct 6, 2022, 1:44 AM IST

వన్య‌ప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్​పుర్​లోని అష్ఫక్ ఉల్లాఖాన్ జువలాజికల్ పార్క్​ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ‌న కాన్పూర్ జూ నుంచి తెప్పించిన తెల్లపులి గీత‌ను, రెండు హిమాలయ కృష్ణ ఎలుగుబంట్లు జూలో విడిచిపెట్టారు. రెండున్నర నెలల క్రితం ఈ పులిని ఇక్కడికి తీసుకొచ్చారు అధికారులు. 

అంతకుముందు ఓ చిరుతకు పాలుపట్టించారు యోగి. గోరఖ్​పుర్​లోని వెటర్నరీ ఆస్పత్రి వైద్యుడు యోగేశ్ సింగ్ పర్యవేక్షణలో ఉన్న చిరుత పిల్లను ఒడిలోకి తీసుకొని.. డబ్బాతో పాలు తాగించారు. అనంత‌రం రెండు చిన్నారి చిరుతల‌కు చండీ, భ‌వాని అని పేరు పెట్టారు. అనంతరం, అధికారులతో మాట్లాడారు

వన్య‌ప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్​పుర్​లోని అష్ఫక్ ఉల్లాఖాన్ జువలాజికల్ పార్క్​ను సందర్శించారు. ఈ సందర్భంగా తెల్ల పులి గీతను జంతు ప్రదర్శన శాలలో విడిచిపెట్టారు. రెండున్నర నెలల క్రితం ఈ పులిని ఇక్కడికి తీసుకొచ్చారు. అదే స‌మ‌యంలో  ఆయన చిరుతపులి పిల్లకు పాలు పట్టిస్తూ కనిపించారు.  అలాగే.. రెండు చిరుత‌ పిల్లలకు నామకరణం చేశాడు. ఒక పిల్ల‌కు చంఢీ, మ‌రో దానికి భ‌వాని అని పేర్లు పెట్టారు.  అనంత‌రం ఆ పిల్ల‌ల‌ను గోరఖ్‌పూర్ జూలాజికల్ పార్కుకు తరలించారు.

అంతకుముందు ఓ చిరుతకు సీఎం యోగి పాలు పట్టించారు. ఆయ‌న  వెటర్నరీ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో  ఉన్న చిరుత పిల్లను ఒడిలోకి తీసుకొని.. డబ్బాతో పాలు తాగించారు. ఆ చిన్నారి చిరుతకు చండీ అని పేరు పెట్టారు. అనంతరం..అక్క‌డి వైద్య ఆరోగ్య‌ అధికారులతో మాట్లాడారు
  
ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం కిథోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవాన్‌పూర్ బంగర్ గ్రామంలో 
చిరుత పులి పిల్ల కనిపించింది. గ్రామస్తులు ఆ పిల్లను ఎత్తుకుని గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం రేంజర్ జగన్నాథ్ కశ్యప్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆ పిల్ల‌ను  స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు పిల్ల వయస్సు రెండు-మూడు వారాలే. దానికి 'సింబి' అనే పేరు పెట్టారు. అనంత‌రం..  ఏప్రిల్ 8న గోరఖ్‌పూర్‌లోని జూలాజికల్ పార్కుకు పిల్లను పంపించారు. గోరఖ్‌పూర్‌లోనే దీనికి ఇప్పుడు 'చండీ' అనే కొత్త పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పిల్ల వయసు ఆరు నెలల 18 రోజులు. ఆమె బరువు కూడా 11.65 కిలోలు. దానికి ఆహారంగా.. ఉడికించిన, పచ్చి మాంసం, చికెన్ సూప్ మొదలైన వాటిని అందిస్తారు. 

మ‌రో చిరుతను చాంద్‌పూర్ పరిధిలోని లోడిపూర్ మిలక్ గ్రామంలో గ్రామ‌స్థుల గుర్తించారు. అప్ప‌డు ఆ పిల్ల వ‌య‌స్సు కేవ‌లం ఏడు రోజులు మాత్ర‌మే.. ఇప్పుడు ఆ చిరుత పిల్ల‌కే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ‘భవానీ’ అని పేరు పెట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios