Asianet News TeluguAsianet News Telugu

అఖిలేష్ యాదవ్ ఇంట్లో కరోనా కలకలం.. ఫోన్ చేసి మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్

ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కుటుంబంలో కరోనా (Coronavirus) కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath).. అఖిలేష్ యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

up cm Yogi Adityanath dials Akhilesh Yadav after Wife and Daughter Test Positive
Author
Lucknow, First Published Dec 23, 2021, 12:03 PM IST

ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కుటుంబంలో కరోనా (Coronavirus) కలకలం రేపింది. ఆయన సతీమణి మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ (Dimple Yadav), కుమర్తెకు  కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. అఖిలేష్ యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బుధవారం రాత్రి అఖిలేష్ యాదవ్‌తో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఫోన్‌లో మాట్లాడినట్టుగా యూపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అఖిలేష్ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్  ఆకాంక్షించారని పేర్కొంది. 

ఇక, భార్య‌, కూతురుకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో అఖిలేష్ యాదవ్ కూడా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆయనకు నెగటివ్‌ వచ్చినట్టుగా సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న అఖిలేష్‌కు కరోనా నెగిటివ్‌గా నిర్దారణ కావడంతో పార్టీ శ్రేణులు ఉపిరి పీల్చుకున్నారు.

 

బుధవారం తనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయాన్ని డింపుల్ యాదవ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ‘నేను కోవిడ్ పరీక్షలు చేయించుకోగా.. అందులో పాజిటివ్‌గా నిర్దారణ అయంది. నేను వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకన్నాను. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. నా భద్రతతో పాటుగా, ఇతరుల భద్రత కోసం నేను స్వీయ ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా వెంటనే కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని’ డింపుల్ యాదవ్ అభ్యర్థించారు. 

వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే యూపీలో అన్ని పార్టీలు తమ వ్యుహాలకు పదును పెడుతున్నాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో సమాజ్‌వాదీ పార్టీ యూపీ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ముందుగానే నిర్ణయించబడిన.. అనేక సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొనాల్సి ఉంది. ఇక, ఆదివారం లక్నోలోని తన నివాసంలో ఉన్న అఖిలేష్ యాదవ్.. సోమవారం నుంచి మధ్య, పశ్చిమ యూపీలో తన పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

అయితే అఖిలేష్‌ యాదవ్ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారా..? లేదా..? అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. గత నెలలో ఓ చానెల్ ఇంటర్వ్యూలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల నుంచి ప్రధాని మోదీ ఫొటోను తీసివేస్తేనే తాను టీకా వేసుకుంటానని చెప్పారు. ‘నాకు కోవిడ్ వచ్చింది, నాకు మళ్లీ రాదని అధ్యయనాలు చెబుతున్నాయి. టీకాలు వేసుకున్నవారికి కూడా కోవిడ్ మళ్లీ వస్తోంది... టీకా సర్టిఫికేట్‌పై ప్రభుత్వం జాతీయ జెండాను ఉంచినట్లయితే.. నేను దానిని తీసుకుంటాను’ అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios