Asianet News TeluguAsianet News Telugu

హనుమంతుడు ముస్లీమే...బిజెపి నేత సంచలన వ్యాఖ్యలు

హిందువులు దేవుడిగా పూజించే హనుమంతుడి చుట్టూ ఇప్పుడు యూపీ రాజకీయాల తిరుగుతున్నాయి. ఆయన ఏ కులానికి చెందినవాడన్న దానిపై ఉత్తర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హనుమంతుడిని అనాది నుండి తామే పూజిస్తున్నాం కాబట్టి హిందువేనని ఓ వర్గం...కాదు కాదు దళితుండంటూ మరో వర్గం వాదిస్తున్నారు. తాజాగా ఆయన ఈ రెండు వర్గాలను చెందినవాడు కాదు...ముస్లీం సామాజిక వర్గానికి చెందినవాడంటూ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ బిజెపి ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

up bjp mlc controversy statement on lord hanuman
Author
Uttar Pradesh, First Published Dec 20, 2018, 6:47 PM IST

హిందువులు దేవుడిగా పూజించే హనుమంతుడి చుట్టూ ఇప్పుడు యూపీ రాజకీయాల తిరుగుతున్నాయి. ఆయన ఏ కులానికి చెందినవాడన్న దానిపై ఉత్తర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హనుమంతుడిని అనాది నుండి తామే పూజిస్తున్నాం కాబట్టి హిందువేనని ఓ వర్గం...కాదు కాదు దళితుండంటూ మరో వర్గం వాదిస్తున్నారు. తాజాగా ఆయన ఈ రెండు వర్గాలను చెందినవాడు కాదు...ముస్లీం సామాజిక వర్గానికి చెందినవాడంటూ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ బిజెపి ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఉత్తర ప్రదేశ్ బిజెపి ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్ హనుమంతుడు ముస్లీ మతానికి చెందినవాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ అనే పేరే అందుకు సాక్ష్యమని  ఆయన  పేర్కొన్నారు. ముస్లీంలలో రహ్మాన్, రంజాన్, జీషాన్, ఫర్మాన్ పేర్ల మాదిరిగానే హనుమాన్ పేరు కూడా ఉందని ఆయన తెలిపారు. ఇలాంటి పేరు కేవలం ఇస్లాం సాంప్రదాయంలో మాత్రమే కనిపిస్తుందని... అందువల్లే హనుమాన్ ముస్లీం అని తాను బలంగా నమ్ముతున్నట్లు నవాబ్ వెల్లడించారు. 

గతకొద్ది రోజులుగా ఉత్తర ప్రదేశ్ లో హనుమంతుడి కులం పై రాజకీయాలు జరుగుతున్నాయి. హనుమంతుడు దళితుడంటూ స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ సభలో పేర్కొనడంతో వివాదం మొదలయ్యింది.  సీఎం వ్యాఖ్యలపై యూపీలోనే కాదు దేశవ్యాప్తంగా పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లవెత్తాయి. దేశంలో ఓ వర్గం దేవుడిగా పూజించే హనుమంతున్ని ఓ కులానికి చెందిన వాడిగా పేర్కొనడం వివాదానికి దారితీసింది.    

తాజాగా అదే బిజెపి పార్టీకి చెందిన మైనారిటీ ఎమ్మెల్సీ హనుమంతుడిని తమ సామాజిక వర్గానికి చెందిన వాడిగా పేర్కొనడంతో వివాదం ముదిరింది. బిజెపి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇప్పటివరకు రాముడి పేరు వాడుకుందని...ఇప్పుడు హనుమంతుడి పేరు వాడుకుంటోందని ప్రత్యర్థి పార్టీ నాయకులతో పాటు వివిధ వర్గాలు విమర్శిస్తున్నాయి. 
 
Follow Us:
Download App:
  • android
  • ios