Asianet News TeluguAsianet News Telugu

up assembly election 2022 : సీఎం కుర్చీకి క‌లిసిరాని గోర‌ఖ్ పూర్.. అదే జరిగితే యోగీకి ఇబ్బందే..

యూపీ ప్రస్తుత సీఎం యోగి ఆధిత్యనాథ్ తొలిసారిగా అసెంబ్లీ కి పోటీ చేయబోతున్నారు. అయితే ఆయన పోటీ చేయబోతున్న గోరఖ్ పూర్ ప్రాంతానికి ఓ చరిత్ర ఉంది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన సీఎం ఓటమి పాలవడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 

up assembly election 2022: Gorakhpur is not ready for the CM chair .. Yogi will be in trouble if the same happens ..
Author
Gorkhapur, First Published Jan 21, 2022, 4:15 PM IST

యూపీ (up) లో రాజ‌కీయాలు వేడి పుట్టిస్తున్నాయి. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. మొన్నటి వ‌ర‌కు బీజేపీలో, ప్ర‌భుత్వంలో ముఖ్య స్థానాల్లో ఉన్న లీడ‌ర్లు రెండు రోజుల కింద‌ట  ప్ర‌తిప‌క్ష స‌మాజ్ వాదీ (samjwadi party) పార్టీలో చేరారు. అలాగే స‌మాజ్ వాదీ పార్టీ ముఖ్యనేత ములాయం సింగ్ యాద‌వ్ (mulayam singh yadav) చిన్న కోడ‌లు బీజేపీలో చేరారు. ఇలా స‌మీక‌ర‌ణ‌లు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్, బీఎస్పీలో కూడా ఈ ఎన్నిక‌ల్లో గ‌ట్టిగానే పోటీ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయి. 

ఇదిలా ఉండ‌గా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (uthara pradhesh) ఎన్నిక‌ల్లో ఈ సారి కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి సీఎం అభ్య‌ర్థులుగా ఉండే వారు మొద‌టి సారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొంటామ‌ని ప్ర‌క‌టించారు. యూపీ రాజ‌కీయ చ‌రిత్ర చూస్తే దాదాపుగా సీఎం కుర్చీని అధీష్టించిన వారెవరూ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. అంటే ఎవ‌రూ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేగా ఉండి సీఎం ప‌ద‌విని చేప‌ట్టలేదు. శాస‌నమండ‌లి స‌భ్యుడిగా గెలిచి లేదా నామినేట్ (nominate) అయి రాష్ట్రాన్ని పాలించిన వారే అధికంగా ఉన్నారు. దీనికి కార‌ణాలు ఉన్నాయి. గ‌తంలో అన్ని రాష్ట్రాల్లో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన మెజారిటీ ఉండేది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నా.. రాష్ట్ర స్థాయి నాయ‌కులు దానిని  వ్య‌తిరేకించేవారు కాదు. ఇలా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ లీడ‌ర్లు ఎలా చెబితే అలా న‌డిచేది. రాత్రికి రాత్రే సీఎంలు, మంత్రులు మారిపోయేవారు. ఇలాంటి ప‌రిస్థితులు మ‌న ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా  చూసింది. దీంతో ఇలా ఒక్క రోజులోనే సీఎం అయిన వారు ఆ ప‌ద‌విలో కొన‌సాగాలంటే త‌ప్ప‌ని స‌రిగా అసెంబ్లీ స‌భ్యుడు అయి ఉండాలి. అంటే సీఎం (cm) అయిన ఆరు నెల‌ల్లోపు శాస‌న స‌భ లేదా శాస‌న మండ‌లి స‌భ్యుడిగా ఎన్నిక‌వ్వాలి. 

యూపీలో ఇలా సీఎంలు అయిన వారు శాస‌న మండ‌లికి ఎన్నికై రాష్ట్రాన్ని పాలించేవారు. కొన్ని సంద‌ర్భాల్లో ఏ పార్టీకి మెజారిటీ (majority) రాని స‌మ‌యంలో, వివిధ పార్టీలో అసంతృప్తులు చెల‌రేగిన స‌మ‌యాల్లో కూడా ఇలా అనుకోని వ్య‌క్తులు సీఎంలు అయ్యేవారు. దీంతో వారంద‌రూ శాస‌నమండ‌లి ద్వారానే ప‌ద‌విలో కొన‌సాగేవారు. ఇలా యూపీ చ‌రిత్ర‌లో ఎన్నిక‌ల స‌మ‌యం కంటే ముందు సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌నే విష‌యం చాలా సందర్భాల్లో తెలిసేది కాదు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా యోగీ ఆధిత్య‌నాథ్ సీఎం అవుతార‌ని ఎవ‌రూ అనుకోలేదు. బీజేపీ ఒంట‌రిగా అత్య‌ధిక స్థానాలు సాధించ‌డంతో యోగి (yogi) పేరు అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చింది. 2017 ఎన్నిక‌ల్లో ఆయ‌న గోర‌ఖ్ పూర్ (gorakhpur) నుంచి లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. సీఎం అయిన త‌రువాత యోగి శాస‌న మండ‌లికి ఎంపికై.. పూర్తి కాలం పాటు పాలించారు. 

ఈ ఎన్నిక‌ల్లో యోగి ఆధిత్య‌నాథ్ (yogi adhithyanath) గోర‌ఖ్ పూర్ అర్బ‌న్ నియోజ‌కవ‌ర్గం నుంచి, స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ (akhilesh yadav) క‌ర్హాల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌బోతున్నారు. అఖిలేష్ యాద‌వ్ కూడా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఇదే తొలిసారి. ప్ర‌స్తుత సీఎం పోటీ చేయ‌బోతున్న గోర‌ఖ్ పూర్ కు ఓ చ‌రిత్ర ఉంది. గ‌తంలో ఇక్క‌డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓ సీఎం ఓడిపోయారు. దీంతో ఆయ‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. మ‌ళ్లీ ఇప్పుడు యాబై ఏళ్ల త‌రువాత‌ అక్కడి నుంచి ఓ సీఎం పోటీ చేయ‌బోతుండ‌టంతో అందరూ ఈ స్థానం చ‌రిత్ర‌ను గుర్తు చేసుకుంటున్నారు. 

ఇప్పుడు యోగి ఆధిత్య‌నాథ్ పోటీ చేయ‌బోతున్న గోర‌ఖ్ పూర్ ప్రాంతం బీజేపీకి కంచుకోట‌. ఇక్క‌డి నుంచే యోగి ఐదుసార్లు లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల 1969లో యూపీలో రాష్ట్ర‌పతి పాల‌న అమ‌లు చేశారు. 1970 లో అది ముగిసిపోయింది. ఆ స‌మ‌యంలో కాంగ్రెసేత‌ర ప‌క్షాలు కూట‌మిగా ఏర్ప‌డి త్రిభువ‌న్ న‌రైన్ సింగ్ (tribhuvan narain singh) సీఎం అయ్యారు. ఈ సంకీర్ణ ప్ర‌భుత్వంలో సీఎం సీటు ఎక్కిన ఆయ‌న అసెంబ్లీలో స‌భ్యుడిగా లేరు. దీంతో ఆయ‌న 1971 సంవ‌త్స‌రంలో గోర‌ఖ్ పూర్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ అక్క‌డ ఓడిపోవ‌డంతో త్రిభువ‌న్ రాజీనామా చేశారు. ఇంత వ‌ర‌కు ఆ స్థానం నుంచి ఎవ‌రూ సీఎంగా లేరు. దీంతో ఆ స్థానానికి సీఎం ప‌దవి క‌లిసిరాలేద‌నే చెప్పాలి. ఇప్పుడు యోగి అక్క‌డి నుంచే పోటీ చేస్తున్నారు. మ‌ళ్లీ అలాంటి ప‌రిణామ‌లు చోటు చేసుకుంటే ఆయ‌న ఇబ్బందుల్లో ప‌డతారు. గెలిస్తే మాత్రం ఆ సెంటిమెంట్ ను తిర‌గ‌రాసిన వ్య‌క్తిగా రికార్డుల్లోకి ఎక్కుతారు.  

Follow Us:
Download App:
  • android
  • ios