యూపీలో కేబినేట్ మినిస్టర్ పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య నేడు సమాజ్ వాదీ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం మీడియాతో వివరాలు పంచుకున్నారు. 

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ యూపీ (uthar pradhesh) లో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీల‌కు చేరిక‌లు చ‌క చ‌క జ‌రిగిపోతున్నాయి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ (yogi adhitya nadh) ఆధ్వ‌ర్యంలోని కేబినేట్ మినిస్ట‌ర్ గా ఉన్న స్వామి ప్ర‌సాద్ మౌర్య (swamy prasad mourya) ఈ నెల 11వ తేదీన రాజీనామ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయన తిర‌గి ఏ పార్టీలో చేరుతార‌న్న విష‌యంలో గంద‌రగోళం నెల‌కొంది. స‌మాజ్ వాదీ పార్టీలో చేరుతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చినా..ఈ విష‌యంలో మౌర్య స్పందించ‌లేదు. అయితే ఈ రోజు (శుక్ర‌వారం) స‌మాజ్ వాదీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 

తాను స‌మాజ్ వాదీ పార్టీ (samajwadi party) అధినేత‌ను క‌లిశాన‌ని, ఆయ‌న స‌న్నిహితుల‌కు తన‌ను ప‌రిచ‌యం చేశార‌ని మౌర్య గురువారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. త‌న ఆ పార్టీలో చేరుతున్న‌ట్టు నేడు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని తెలిపారు. ఎస్పీ నేతృత్వంలోని కూట‌మి యూపీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 

స్వామి ప్రసాద్ మౌర్య ఏఎన్‌ఐతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ‘ జనవరి 14వ తేదీన సమాజ్‌వాదీ పార్టీలో చేరబోతున్నాను. నాకు ఏ స్థాయి రాజకీయ నాయకుడి నుంచి కాల్స్ రాలేదు. అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ ప్రజా సమస్యలపై పని చేస్తే ఆ పార్టీకి ఇప్పుడు ఈ సమస్య ఎదుర‌య్యేది కాదు.’’ అని అన్నారు. బీజేపీ నేతలు అధికారంలో ఉన్నా.. పెద్ద నాయ‌కులైనా తాను ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లేది లేద‌ని తెలిపారు. విల్లులోంచి ఒక్క సారి బాణం బ‌య‌ట‌కు వ‌చ్చింది కాబ‌ట్టి ఇప్పుడు అందులోకి తిరిగి వెళ్ల‌ద‌ని స్ప‌ష్టం చేశారు. 

స్వామి ప్ర‌సాద్ మౌర్య యూపీలో ప్ర‌భావంత‌మైన ఓబీసీ (obc) నాయ‌కుడు. కుషావా వర్గాల్లో ఆయ‌నకు అపారమైన పట్టు ఉంది. పూర్వాంచల్ ప్రాంతంలోని అనేక జిల్లాల్లో అతనికి గణనీయమైన మద్దతు ఉంది. మౌర్య ప్ర‌స్తుతం బీజేపీ నుంచి ఆమె బదౌన్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. యోగీ ఆధిత్య‌నాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వంలో ఆయ‌న కేబినేట్ మిన‌స్ట‌ర్ గా ఉన్నారు. మంగ‌ళ‌వారం రోజు ఆయ‌న అనూహ్యంగా త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇది రాష్ట్ర రాజ‌కీయాల్లో తుఫాను రేకెత్తించింది. అయితే స్వామి ప్ర‌సాద్ మౌర్య కూతురు సంఘమిత్ర మౌర్య బదౌన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి ఎంపీగా ఉండ‌టం గ‌మ‌నార్హం. 

సరిగ్గా ఎన్నిక‌ల‌కు ముందు మౌర్య మంత్రివర్గం నుంచి, బీజేపీ నుంచి వైదొలగాలని తీసుకున్న నిర్ణయం వ‌ల్ల అధికార పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఆయన రాజీనామాతో బీజేపీ ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేశారు. ఉత్తరప్రదేశ్ మంత్రులు దారా సింగ్ చౌహాన్, ధరమ్ సింగ్ సైనీ వరుసగా జనవరి 12 13వ తేదీన తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఈ ముగ్గురు మంత్రులే కాకుండా బీజేపీ నుంచి షికోహాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ ముఖేష్ వర్మ, అవతార్ సింగ్ భదానా, బ్రిజేష్ కుమార్ ప్రజాపతి, రోషన్ లాల్ వర్మ, భగవతి శరణ్ సాగర్, వినయ్ షాక్యా కూడా కొన్ని రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేశారు.