ఉత్తరప్రదేశ్ లోని ఘోర ప్రమాదం చోటుచేసుకున్నారు. అతివేగంగా ప్రయాణిస్తున్నా.. కారు అదుపు తప్పి.. కాలువలో పడిపోయింది. దీంతో ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు నేపాలీయులు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం అత్యంత విషాదకరం. 

ఉత్తరప్రదేశ్ లోని శ్రావస్తి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నారు. ఎకోనా ప్రాంతంలో అతివేగంగా ప్రయాణిస్తున్నా.. కారు అదుపు తప్పి.. కాలువలో పడిపోయింది. దీంతో ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు నేపాలీయులు మరణించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రావస్తి జిల్లాలోని ఇకౌనా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సీతాద్వార్ సమీపంలో అర్థరాత్రి అతివేగంగా ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి.. రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నీలాంష్ (36), అతని సోదరి నితి (20), దీపిక (35)తోపాటు వీరితో పాటు ఒకే కుటుంబానికి చెందిన మూడున్నరేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మృతి చెందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇది కాకుండా.. బహ్రైచ్ మెడికల్ కాలేజీలో వైభవ్ (36) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించినట్టు తెలిపారు. అలాగే.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ అజయ్ మిశ్రా (25) బహ్రైచ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. బాధితులు నేపాల్‌లోని నేపాల్‌గంజ్ నగరంలోని త్రిభువన్ చౌక్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.