లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని మైన్ పురి సమీపంలో ఆగ్రా - లక్నో ఎక్స్ ప్రెస్ వేపై ఆదివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 7గురు మరణించారు. మరో 34 మంది గాయపడ్డారు. 

ఎక్స్ ప్రెస్ వేపై బస్సు ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. బస్సు విడిభాగాలను కత్తిరించి, బస్సులో ఇరుక్కున్న శవాలను వెలికి తీశారు. 

ప్రైవేట్ బస్సు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని బెనరాస్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.