సారాంశం
ఇటీవలి కాలంలో విమానాల్లో కొందరు ప్రయాణికుల వికృత ప్రవర్తతో వార్తల్లో నిలుస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు వివామన సిబ్బందిపై శారీరకంగా దాడి చేశాడు.
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో విమానాల్లో కొందరు ప్రయాణికుల వికృత ప్రవర్తతో వార్తల్లో నిలుస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు వివామన సిబ్బందిపై శారీరకంగా దాడి చేశాడు. ఈ ఘటన సోమవారం గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకుంది. విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత వికృత ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా సంస్థ వివరాలు వెల్లడించింది.
సోమవారం గోవా నుంచి ఢిల్లీకి ప్రయాణించిన AI882 విమానంలో ఆ ప్రయాణికుడు వికృతల చేష్టకు పాల్పడినట్టుగా ఎయిర్ ఇండియా పేర్కొంది. ‘‘చెప్పిన ప్రయాణికుడు సిబ్బందిని మాటలతో దుర్భాషలాడాడు. విమానంలో ఉన్న వారిలో ఒకరిపై శారీరకంగా దాడి చేశాడు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే, ప్రయాణీకుడు రెచ్చగొట్టడమే కాకుండా.. దూకుడుగా ప్రవర్తించాడు. అతడిని భద్రతా సిబ్బందికి అప్పగించడం జరిగింది. మేము ఈ ఘటన గురించి రెగ్యులేటర్‌కు నివేదించాం’’ అని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘‘మా సిబ్బంది, ప్రయాణీకుల భద్రత మాకు చాలా ముఖ్యమైనది. ప్రయాణీకుల ఈ వికృత ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బాధిత సిబ్బందికి మేము అన్ని రకాలుగా మద్దతును అందిస్తాము’’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 10న ఢిల్లీ-లండన్ విమానంలో ఇద్దరు మహిళా క్యాబిన్ సిబ్బందికి శారీరక హాని కలిగించిన వ్యక్తిపై ఈ నెల ప్రారంభంలో ఎయిరిండియా రెండేళ్ల నిషేధాన్ని విధించింది.
ఇక, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం వికృత ప్రవర్తన కలిగిన విమాన ప్రయాణీకులు.. వివిధ కాలాలకు ప్రయాణాలపై నిషేధం ఎదుర్కొనవచ్చు. నిబంధనల ప్రకారం.. వాటిని మూడు స్థాయిలుగా వర్గీకరించవచ్చు.