Asianet News TeluguAsianet News Telugu

అన్‌లాక్ 5.0: సినిమా థియేటర్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.. స్కూళ్లు మాత్రం

అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి కొత్త మార్గదర్శకాలు అమలు చేయనుంది. క్రీడాకారుల కోసం స్విమ్మింగ్ పూల్స్‌ను ఓపెన్ చేసుకోవచ్చని వెల్లడించింది

Unlock 5.0 Guidelines
Author
New Delhi, First Published Sep 30, 2020, 8:26 PM IST

అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి కొత్త మార్గదర్శకాలు అమలు చేయనుంది. క్రీడాకారుల కోసం స్విమ్మింగ్ పూల్స్‌ను ఓపెన్ చేసుకోవచ్చని వెల్లడించింది.

అలాగే సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీటింగ్‌తో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది. కేంద్రం ఆదేశాలతో అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు ఓపెన్ కానున్నాయి.

అయితే పాఠశాలల పున: ప్రారంభంపై నిర్ణయం మాత్రం అక్టోబర్ 5 తర్వాతి నుంచి ఆయా రాష్ట్రాలకే వదిలేసింది. అలాగే అక్టోబర్ 5 నుంచి హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లను 50 శాతం పరిమితితో అనుమతించనున్నారు. 

అక్టోబర్ 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే కంటైన్మెంట్ వెలుపల మరిన్ని సడలింపులు ఇవ్వనుంది. కరోనా నిబంధనలతో పార్కులు, ఎగ్జిబిషన్లకు అనుమతించిన కేంద్రం.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios