Asianet News TeluguAsianet News Telugu

అన్‌లాక్ 4: మరిన్ని రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తు.. హోంశాఖ కోర్టులో బంతి

లాక్‌డౌన్‌ నుంచి మరిన్ని ఆంక్షలు సడలిస్తూ దేశవ్యాప్తంగా అన్‌లాక్ 4 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తు మొదలుపెట్టింది.

Unlock 4.0: Indian Railways plans more special trains
Author
New Delhi, First Published Sep 1, 2020, 9:23 PM IST

లాక్‌డౌన్‌ నుంచి మరిన్ని ఆంక్షలు సడలిస్తూ దేశవ్యాప్తంగా అన్‌లాక్ 4 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తు మొదలుపెట్టింది.

అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడున్న వాటికి అదనంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఇందు కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తున్నట్లు రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి.

దాదాపుగా వంద రైళ్లను పట్టాలెక్కించాలని రైల్వే శాఖ కృత నిశ్చయంతో ఉంది. దీనికి సంబంధించి త్వరలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను రైల్వే శాఖ .. హోంశాఖకు పంపింది.

అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రైళ్లు పట్టాలెక్కనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ప్యాసింజర్ రైలు సర్వీసులు ప్రారంభించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.

దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానిస్తూ... ఎక్కువగా ప్రయాణికులు ఉండే మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పాయి. పలు పట్టణాల్లో సబర్బన్ రైళ్లు నడిపేందుకు కూడా ప్రణాళిక సిద్ధదం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో 230 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios