ఆకతాయిల ఆగడాలు రాను రాను మరింత ఎక్కువైపోతున్నాయి. ఓ యువతికి వీడియో కాల్ చేసిన ఓ పోకిరి ఆన్‌లైన్‌లో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ యువతి వెబ్ టెలివిజన్ షోకి స్క్రిప్ట్‌రైటర్‌గా పనిచేస్తోంది.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4.21 సమయంలో ఆమె స్కైప్ నెంబర్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో కాల్ చేశాడు. అతని ముఖం కనిపించలేదని... ఆ వ్యక్తి వెంటనే ఫ్యాంట్ జీప్ తీసి ఆన్‌లైన్‌లో ఆమె ముందే హస్తప్రయోగం చేశాడు.

ఈ హఠాత్పరిణామానికి షాక్‌కు గురైన ఆమె వెంటనే తేరుకుని ఆ సన్నివేశాలను స్క్రీన్ షాట్ తీసి కాల్ డిస్ కనెక్ట్ చేసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ.. బహుశా నాకు తెలిసి ఈ తరహా కేసు ఇదే మొదటిదని అభిప్రాయపడ్డారు.

ఇటువంటి ఘటనలు రోడ్డు మీదే కనిపిస్తాయి కానీ.. ఆన్‌లైన్‌లో ఎప్పుడూ చూడలేన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడి ఆధారాలు గుర్తిస్తున్నారు.