Asianet News TeluguAsianet News Telugu

శరద్ పవార్ కి కేంద్ర మంత్రి బెదిరింపులు: శివసేన నేత సంజయ్ రౌత్ సంచలనం

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కేంద్ర మంత్రి బెదిరింపులకు పాల్పడ్డారని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు.  ఓ కేంద్ర మంత్రి శరద్ పవార్ ను బెదిరించారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సరైనవి కావన్నారు

Union Minister Threatening Sharad Pawar: Alleges Sena
Author
Mumbai, First Published Jun 24, 2022, 10:27 AM IST

ముంబై: NCP  చీఫ్ Sharad Pawarను కేంద్ర మంత్రి  బెదిరించారని Shiv Sena  అధికార ప్రతినిధి Sanjay Raut ఆరోపించారు. శరద్ పవార్ ను కేంద్ర మంత్రి బెదిరింపులకు పాల్పడిన విషయమై ప్రధాని Narendra Modi, Amit Shah మన్నిస్తారా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఈ విషయం మహారాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని ఆయన చెప్పారు.

మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు శరద్ పవార్ ప్రయత్నిస్తే అతడిని ఇంటికి వెళ్లనివ్వబోమని రోడ్డుపై అడ్డుకుంటామని ఓ కేంద్ర మంత్రి బెదిరించారని సంజయ్ రౌత్ ఆరోపించారు. Maharashtra లో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఉన్న, లేకపోయినా కూడా ఇలాంటి మాటలు ఆమోదయోగ్యం కాదని శివసేన అధికార ప్రతినిధి  సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు.

 శివసేనకు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో మెజారిటీ మంది ప్రజా ప్రతినిధులున్నారు. ఉద్దవ్ ఠాక్రే  వద్ద తక్కువ  ఎమ్మెల్యేలున్నారు.శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే వైపే  పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు చేరారు. 

also read:maharashtra crisis : దారికి రాని రెబెల్స్... 17 మందిపై అనర్హత అస్త్రాన్ని ప్రయోగించిన శివసేన..?

మహారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం కొన‌సాగుతున్నది. పతనం అంచున ఉన్న మ‌హారాష్ట్ర‌ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శివసేన తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఆ పార్టీకి చెందిన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా అందులోని 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మహారాష్ట్ర  అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కి శివసేన అప్పీల్ చేసింది.

ప్ర‌స్తుతం గౌహతి క్యాంప్ లో దాదాపు 40 రెబ‌ల్ ఎమ్మెల్యేలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో ఏక్‌నాథ్  షిండే, తానాజీ , సావంత్, మహేష్ షిండే, అబ్దుల్ సత్తార్, సందీపన్‌రావ్ బుమ్రే, భరత్‌షేత్ గోగావాలే, సంజయ్ శిర్సత్, యామిని జాదవ్, లతా చంద్రకాంత్, అనిల్ బాబర్, ప్రకాష్ సర్వే, బాలాజీ కినికర్ వంటి వాళ్లు ఉన్నారు.

12 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల‌ని శివసేన ప్ర‌య‌త్నిస్తోంది. ఈ చర్యపై తిరుగుబాటుదారుడు ఏక్‌నాథ్ షిండే  నుండి ఘాటుగా స్పందించారు. తన వర్గాన్ని నిజమైన శివసేనగా అభివర్ణిస్తూ  తాము ఎవరి బెదిరింపుల‌కు భయప‌డ‌మని తేల్చి చెప్పాడు. ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారు? మీ వ్యూహాలు, చట్టం మాకు తెలుసు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం విప్ ప‌వ‌ర్ కేవ‌లం అసెంబ్లీ వ్య‌వ‌హారాల‌కు మాత్ర‌మేన‌ని  సమావేశానికి కాదు అని తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు అనేకం ఉన్నాయని మ‌రో ట్వీట్ లో పేర్కొన్నారు. 

శివ‌ సేన తిరుగుబాటుదారులకు అల్టిమేటం జారీ చేసింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తన అధికారిక నివాసం వర్షలో సాయంత్రం 5 గంటలకు పిలిచిన సమావేశానికి హాజరు కాలేకపోతే అనర్హత వేటు వేసింది. శివసేన కొత్తగా నియమితులైన లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అజయ్ చౌదరి, హాజరుకాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాశారు. మంగళవారం ఏకనాథ్ షిండే తిరుగుబాటు తర్వాత, మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీ శాసనసభా పక్ష నేత పదవి నుంచి శివసేన షిండేను తొలగించారు.ఈ విషయంపై శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌ స్పందించారు. బుధ‌వారం సమావేశానికి హాజరుకానందున 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ డిప్యూటీ స్పీకర్‌కు పిటిషన్‌ వేశామని తెలిపారు. వారి తప్పిదం వ‌ల్ల‌నే ఈ పరిస్థితి వచ్చిందనీ,  వారి సభ్యత్వం రద్దు చేస్తామని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios