అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు నిమిత్తం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించకుండా విపక్షాలు అడ్డుపడుతండటంపై కేంద్రమంత్రి థావర్ చంద్ స్పందించారు. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసమే ఈ బిల్లు రూపొందించినట్లు తెలిపారు.

విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అందుతాయని, ‘‘సబ్‌కా సాథ్...సబ్‌కా వికాస్’’ నినాదం పరిపూర్ణం చేయడానికే ఈ బిల్లును తీసుకొచ్చామన్నారు. మంచి ఉద్దేశ్యంతో ఈబీసీ రిజర్వేషన్ల చట్టం చేస్తున్నామన్నారని థావర్ చంద్ తెలిపారు.

అగ్రకులాల్లోనూ పేదరికంలో మగ్గుతున్నారని..  ఆఖరికి చదువుకోవాలన్నా, వాళ్లు బ్యాంకు లోన్లు తీసుకుంటున్నారని గెహ్లాట్ ఆవేదన వ్యక్తం చేశారు. పేద-గొప్ప అనే తారతమ్యం లేకుండా, సామాజిక సమానత్వం కోసమే ఈబీసీ రిజర్వేషన్లకు రూపకల్పన చేసినట్లు వెల్లడించారు.