కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పలుగు, పార పట్టి ఆవుపేడను తొలగించారు. వారణాసిలో తమ పార్టీ ఏర్పాటు చేసిన పారిశుద్ధ డ్రైవ్ ను ఆమె ప్రారంభించారు.
వారణాసి : బీజేపీ నేత Smriti Irani ఓ పేద మహిళకు సాయం చేసి వార్తల్లోకి ఎక్కారు. Varanasi పర్యటనలో ఉన్న ఆమె మంగళవారం ఉదయం సువర్‌బద్వా ప్రాంతంలోని భీమ్ నగర్ మురికివాడల్లో పర్యటించారు. ఈ సమయంలో ఓ మహిళ తన పొలంలో ఉన్న ఆవు పేడను తీయడానికి ప్రయత్నిస్తుంది. ఆమెకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సాయం చేశారు. చేతిలో పలుగు, పార పట్టుకుని cow dungను తొలగించడానికి నడుం బిగించారు.
ఆమె అలా చేయడాన్ని చూసిన వందలాది మంది భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలు పారిశుద్ధ్య డ్రైవ్‌లో ఆమెతో పాటు పాల్గొన్నారు. వారు కూడా చకచకా పనుల్లో మునిగిపోయారు. దీంతో, కొద్ది నిమిషాల్లోనే ఆవు పేడ కుప్ప తొలగించబడింది. క్షణాల్లో పొలం శుభ్రంగా మారింది. స్మృతి ఇరానీ తన రెండు రోజుల వారణాసి పర్యటనలో చివరి రోజున తన పార్టీ తరఫున పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టేందుకు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో సువార్‌బద్వా ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ మహిళకు ఇలా సహాయ పడ్డారు.
ఆమె డ్రైవ్‌ను ప్రారంభించడానికి అక్కడికి వెళ్లినప్పుడు.. ఓ వృద్ధ మహిళ స్మృతి ఇరానీతో మాట్లాడుతూ.. కొంతమంది డెయిరీ నిర్వాహకులు తన ఇంటి ముందు ఉన్న పొలంలో ఆవు పేడను పారవేశారని.. దానిని తొలగించేలా చర్యలు తీసుకుంటే.. తన కూతురు వివాహం ఆ ప్లేస్ లో చేయాలనుకుంటున్నానని చెప్పింది. దీంతో వెంటనే స్మృతి ఇరానీ ఆ పనితోనే తన శానిటేషన్ డ్రైవ్ మొదలుపెట్టారు.
ఇరానీ మాట్లాడుతూ, “మంచి పనికి ఆలస్యం చేయకూడదు. మేం ఇప్పుడే ఆవు పేడను తొలగిస్తాం’’.. అని మాట ఇచ్చిన స్మృతి ఇరానీ వెంటనే ఎండిన ఆవు పేడను పలుగుతో కొట్టడం ప్రారంభించింది. మంత్రి చర్యతో, బిజెపి కార్యకర్తలు ట్రాలీలను తీసుకువచ్చి కొద్ది నిమిషాల్లోనే మైదానాన్ని క్లియర్ చేశారు. ఆ తర్వాత, రోహనియా ప్రాంతంలోని కేశ్రీపూర్‌లోని కాశీ ప్రాంతీయ విభాగంలో పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు హన్సరాజ్ విశ్వకర్మ ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఇరానీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ కమిటీలను మరింత బలోపేతం చేసేందుకు ఆమె పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేశారు. ‘‘పార్టీ మా అమ్మ, కార్యకర్తలు దాని బిడ్డలు. ప్రతి బూత్‌లో పార్టీని బలోపేతం చేయడానికి మనమందరం కృషి చేయాలి, ”అని ఆమె అన్నారు, 2024 లోక్‌సభ ఎన్నికల కోసం పనిని ప్రారంభించాలని, ప్రజలతో సరైన కమ్యూనికేషన్‌ను కొనసాగించాలని పార్టీ కార్యకర్తలను కోరారు.
