బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు.

కొద్దిరోజుల క్రితం తన భర్త కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన స్మృతీ తాజాగా తన కొత్త హెయిర్ స్టైల్, లుక్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. అంతేకాదు ఆమె చాలా రోజుల తర్వాత ఆటోలో ప్రయాణించారు.

ప్రయాణం తర్వాత హెయిర్ కట్ చేయించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సదరు ఫోటోలో తన హెయిర్‌ను భుజాల వరకు తగ్గించి స్టైల్‌గా సెల్ఫీని స్మృతీ పోస్ట్ చేశారు. ‘‘హెయిర్ కట్ కియా , జో కల్ ఫిర్ బాంద్ లూంగీ (హెయిర్ కట్ చేయించాను.. రేపు మళ్లీ ముడేసుకుంటా) అంటూ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన అభిమానులు భారీగా లైక్స్, కామెంట్స్ చేశారు. 

Also Read:

భర్త కోసం ఎగ్‌ ఫ్రైడ్ రైస్ చేసిన స్మృతీ ఇరానీ: నేర్చుకునే వారి కోసం రెసీపీ

కేజ్రీవాల్ పై స్మృతీ ఇరాని ట్వీట్ : "యేల్" డిగ్రీలు అందరికి ఉండవు కదా అంటూ ట్రోలింగ్