ఢిల్లీ ముఖ్యమంత్రిపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ విరుచుకుపడింది. ఎన్నికల సందర్భంగా మహిళలు అంతా బయటకు వచ్చి ఓటు వేయాలని అడుగుతూ ఇంటి సభ్యులతో కూడా చర్చిందని అని అన్నాడు. 

దానికి ప్రతిస్పందిస్తూ...మహిళా వ్యతిరేకి కేజ్రీవాల్ అంటూ స్మృతీ ఇరానీ ఆయనపై విరుచుకుపడింది. మహిళలు ఎవరిని ఎన్నుకోవాలి వారికి తెలుసునని, ఓటు వేయడానికి వారు కుటుంబసభ్యులతో చర్చించాల్సిన అవసరం లేదని స్మృతీ ఇరాని ట్వీట్ చేసింది. 

స్మృతీ ఇరాని కేజ్రీవాల్ చెప్పిన అంశాన్ని మార్చి మరో విధంగా ట్వీట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని సోషల్ మీడియాలో ఆమెపై తెగ సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి కేజ్రీవాల్ మహిళలను తమ కుటుంబ సభ్యులకు చెప్పి వారితో కూడా అభివృద్ధికి ఓటు వేయించండని కోరాడు. 

దాన్ని ట్విస్ట్ చేస్తూ ఇలా మహిళా వ్యతిరేకి కేజ్రీవాల్ అని అనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరేమో అందరికి యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీలు లేవుగా అంటూ సెటైర్లు వేశారు. 

ఎన్నిక అక్కడ హాట్ హాట్ గా సాగుతోంది. ఉదయం చలి తీవ్రత తీవ్రంగా ఉండడంతో పోలింగ్ మందకొడిగా ప్రారంభమయింది. నెమ్మదిగా పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. 

చలి ప్రభావం వల్ల ఇప్పటికే పోలింగ్ ను మామూలుగా 7 గంటలకు కాకుండా 8 గంటలకు ప్రారంభించారు. దీనితో ఎన్నికలు సాయంత్రం 6గంటలకు ముగియనున్నాయి. 

ఇక 70 నియోజికవర్గాలున్న ఢిల్లీ బరిలో మొత్తం 672మంది అభ్యర్థులు నిలిచారు. కాగా.. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏరక్పాట్లు చేశారు. 

మొత్తం 13,750 పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచారు. గత కొన్ని రోజులుగా ఢి్లీలో నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో భద్రత కూడా భారీగా ఏర్పాటు చేశారు. 

మొత్తం 190 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. 40వేల మంది పోలీసులు పహారా కాయనున్నారు. 19వేల మంది హోంగార్డులు సైతం విధుల్లో పాల్గొననున్నారు.