న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ ప్రయాణీస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో  కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి.

కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో సోమవారం నాడు ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఎల్లాపూర్ నుండి గోకర్ణ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో శ్రీపాదనాయక్ భార్య మరణించారు.శ్రీపాదనాయక్ వ్యక్తిగత కార్యదర్శి దీపక్ కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా పోలీసులు తెలిపారు. 

అంకోలా తాలూకాలో ఈ ఘటన చోటు చేసుకొందని స్థానికులు చెప్పారు. కారు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే గోవా సీఎంతో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. 

కేంద్ర మంత్రిని గోవాలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రధాని మోడీ వైద్యులను ఆదేశించారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఘటనకు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాాదానికి వేగమే కారణమా.. ఇతరత్రా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.