కేంద్ర మంత్రి సదానందగౌడకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆదివారం నాడు చిత్రదుర్గలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

లో బీపీ, షుగర్ లెవల్స్ పడిపోవడంతో సదానంద గౌడ అస్వస్థతకు గురైనట్టుగా వైద్యులు చెప్పారు. కారులో  ప్రయాణీస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురైనట్టుగా సమాచారం.

రాష్ట్రంలోని షిమోగోలో జరిగిన బీజేపీ కార్యనిర్వాహక సమావేశానికి హాజరై బెంగుళూరకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

బెంగుళూరుకు వెళ్తూ భోజనం కోసం చిత్రదుర్గలోని హోటల్ రీజెన్సీకి ఆయన ఇవాళ మధ్యాహ్నం వచ్చాడు. కారు దిగే సమయానికి అనారోగ్యానికి గురైనట్టుగా పార్టీ నేతలు చెప్పారు. వెంటనే స్థానికంగా ఉన్న బసవేశ్వర ఆసుపత్రికి మంత్రిని తరలించారు.మెరుగైన చికిత్స కోసం కేంద్ర మంత్రిని బెంగుళూరుకు తరలిస్తున్నారని తెలుస్తోంది.